![]() |
![]() |

-ధురంధర్ రెండు భాగాల విజయంలో ప్రీతీ కీలకమే
-ఆదిత్య ధర్ ఏం చెప్తున్నాడు
-పూర్తి డీటెయిల్స్ చూద్దాం
ధురంధర్ పార్ట్ 2(Dhurandhar 2)గురించి రోజు మాట్లాడుకోకపోతే మనం భారతీయులేమే కాదు అనే వర్డ్ ఇండియన్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. చక్కర్లు కొట్టడం ఏంటి నిజం కూడా. ఎందుకంటే మన భారత దేశ రక్షణ కోసం సాహసం చేసిన నిజమైన ధురందురుడి జీవిత కథ ఆధారంగానే తెరకెక్కింది. మరి ఈ రోజు ధురంధర్ న్యూస్ పక్కన పుష్ప రాజ్ కూడా చేరాడు. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
ప్రీతీ షీల్ సింగ్(Preetisheel Singh).. ధురంధర్ సిరీస్ కి మేకప్, ప్రోస్థటిక్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసింది. వర్క్ చేసింది అనే కంటే దర్శకుడు ఆదిత్య ధర్ ఏ క్యారక్టర్ నైతే ఉహించుకొని నటులు కాకుండా వాళ్ళు మాత్రమే కనపడాలని అనుకున్నాడో, ఆ ఆలోచనలకి ప్రాణం పోసి ధురంధర్ విజయ శాతాన్ని పెంచింది. సదరు క్యారక్టర్ కి నిజ జీవిత మనుషుల లుక్ వస్తేనే ధురంధర్ ప్రేక్షకులకి నచ్చుతుంది. దీన్ని బట్టి ప్రీతీ వర్క్ ఉన్న రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు. హంజా అలీ మజారి, రెహ్మాన్ డెకాయిత్ కి చేసిన మేకప్ అండ్ ప్రోస్థటిక్ వర్క్ నే ఉదాహరణ. రీసెంట్ గా ప్రీతీతో దిగిన పిక్ ని ఆదిత్యధర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తు 'ధురంధర్ కోసం ప్రీతీ పేరుని కొంత మంది సూచించినప్పుడు తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో పడ్డాను. ఎందుకంటే ప్రీతీ అహంకారి అని,డబ్బులు ఎక్కువుగా డిమాండ్ చేస్తుందనే మాటలు వినడమే నా ఆలోచనలకి కారణం. కానీ ప్రీతీతో ఒక్క మీటింగ్ తర్వాత నేను విన్నవన్ని నిజాలు కాదని అర్థమైంది. దాంతో ఎవరో చెప్పిన మాటలు విని ఒక వ్యక్తిని తప్పుగా అనుకోకుడదని ఫిక్స్ అయ్యాను. ధురంధర్ రెండు భాగాల కోసం ప్రీతీ చాలా కష్టపడింది.
Also Read: Ishwarya vullingala: కమిట్ మెంట్ అంటే అర్ధం ఇదే.. డైరెక్టర్ ని చితకొట్టిన ప్రముఖ నటి
మా కంటే ముందే లొకేషన్ లో ప్రీతీ అండ్ టీం ఉండేది. పేకప్ చెప్పిన తర్వాత కూడా అందరు వెళ్లాకే లొకేషన్ నుంచి వెళ్లిపోయేవాళ్లు. రోజులో రెండు,మూడు గంటల నిద్ర మాత్రమే వాళ్లకి ఉంటుంది. విజన్ కి తగ్గట్టు అంకిత భావంతో వర్క్ చేసి ప్రతి క్యారక్టర్ కి సహజత్వాన్ని తీసుకొచ్చారు. ఇలా చేయడం చాలా అరుదు. ప్రీతీ నా కుటుంబసభ్యురాలు, సోదరి అని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. పుష్ప సిరీస్ కూడా ప్రీతినే మేకప్ మెన్. ఆ సిరీస్ సక్సెస్ లో కూడా మేకప్ ముఖ్యమైన భూమిక పోషించిందనేది పాన్ ఇండియా వ్యాప్తంగా తెలిసిన నిజం.

![]() |
![]() |