![]() |
![]() |

-బర్త్ డే సందర్భంగా టైటిల్ రిలీజ్
-టైటిల్ ఇదే
-ఇక రికార్డులే తరువాయి అంటున్న ఫ్యాన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun),అట్లీ(Atlee)కాంబోలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ వచ్చేసింది. రావడమే కాదు ఎన్నో ప్రశ్నలకి సమాదానాలు వెతుకుతుండంతో పాటు కథ ఏమై ఉంటుందనే ఆలోచన రిలీజ్ టైం వరకు నిత్యం ఉహించుకునేలా ఉంది. మరి టైటిల్ చూద్దాం.
రాకా(Raaka).. టైటిల్ ఇదే... అల్లు అర్జున్ లుక్ తో రిలీజ్ చేసారు. పొడవాటి గోళ్ళతో ఉన్న అల్లు అర్జున్ అతీంద్రీయ శక్తుల్ని నింపుకున్న మహాశక్తినిరా అన్నట్టుగా చూస్తున్నాడు. చూపులు చాలా కన్నింగ్ గా ఉన్నాయి. కనురెప్పల డిజైన్, నెత్తిపై జుట్టు లేకుండా ఉండటం చూస్తే అల్లు అర్జున్ 'రాకా' గా పెద్ద గత్తరనే లేపేలా ఉన్నాడు. టైటిల్ తో పాటు లుక్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ స్పందిస్తు పాన్ ఇండియా లెవల్లో 'రాకా'తో భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త సునామి నమోదవ్వడం ఖాయమని అంటున్నారు.
Also read: Allu Arjun: బర్త్ డే విషెస్ చెప్పడానికి భారీగా చేరిన ఫ్యాన్స్.. 11 గంటలకి నో ట్రాఫిక్
సన్ పిక్చర్స్ కానీ వీని ఎరుగని బడ్జెట్ తో నిర్మిస్తుండగా సాయి అభ్యంకర్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. దీపికా పదుకునే ఒక హీరోయిన్ కాగా మరో నలుగురు హీరోయిన్స్ కి చోటు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు అల్లు అర్జున్ బర్త్ డే అనే విషయం తెలిసిందే.
.

![]() |
![]() |