Home  »  News  »  Ramayana: ఎవరు ఆ 10000 మంది.. ఇక వార్ స్టార్ట్ అయినట్టేనా! 

Updated : Apr 3, 2026

 

-రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్న రామాయణ టీజర్ 
-తాజాగా ఎన్నో విషయాలు బయటకి 
-నితీష్ తివారి చెప్తున్న మాటలేంటి


నిన్నరిలీజైన 'రామాయణ'(Ramayana)టీజర్ తో సాక్షాత్తు ఆ అయోధ్య రాముడే మన మందు నడయాడుతున్నాడా అనిపించింది. అంతలా రామాయణ టీజర్ ప్రతి ఒక్క రామభక్తుడిని తన్మయత్వంతో ముంచెత్తుతుందని చెప్పవచ్చు. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న వ్యూస్ నే ఒక ఉదాహరణ. అదే టైంలో రామాయణని ప్రపంచం మెచ్చేలా చేయడానికి ఎంత కష్టపడుతున్నారో కూడా టీజర్ ద్వారా అర్ధమవుతుంది.అది నిజమే అన్నట్టుగా   రీసెంట్ గా రామాయణ దర్శకుడు నితీష్ తివారి(Nitesh Tiwari)ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఇండియన్ సినీ ప్రేమికులని, రామ భక్తులని విశేషంగా ఆకరిస్తున్నాయి. ఆ మాటలేంటో చూద్దాం


నితీష్ తివారి మాట్లాడుతు 'సెవన్ ఇయర్స్ నుంచి రామాయణ కోసం వర్క్ చేస్తున్నాను. టీజర్ తో ఇప్పుడు లభిస్తున్న ప్రేక్షకాదరణకి కష్టానికి తగిన ప్రతి ఫలం దక్కినట్లయింది . రామాయణ కోసం వరల్డ్ వైడ్ గా 10000 మంది వర్క్ చేస్తున్నారని తెలిపాడు. దీంతో రామాయణ ని ఎంత ప్రతిష్టాత్మకంగా, ప్రాణంగా తీసుకొని తెరకెక్కిస్తున్నారో అర్ధమవుతుంది. భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో నితీష్ తివారి ఒకరు. ఇప్పటికి హయ్యస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీగా రికార్డు పొరల్లో దాగి ఉన్న ఆమీర్ ఖాన్ దంగల్ కి నితీష్ తివారీనే దర్శకుడు, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన 'ఛిచో రె' కూడా నితీష్ తివారిదే.  2023 లో వచ్చిన 'బవాల్' తర్వాత రామాయణతో వస్తున్నాడు.


Also read: Undekhi: ఇండియాలో నిజంగా జరిగిన కథ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ 

రాముడిగా రణబీర్ కపూర్(Ranbir Kapoor)సీతమ్మ తల్లిగా సాయిపల్లవి(sai Pallavi)చేస్తుండగా, యష్(yash)రావణుడిగా చేస్తున్నాడు. రెండు భాగాలుగా తెరెక్కుతున్న రామాయణ మొదటి భాగం ఏ ఏడాది దీపావళికి, రెండవ భాగం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానున్నాయి. నమిత్ మల్హోత్రా ప్రొడ్యూసర్. బాక్స్ ఆఫీస్ వద్ద రామాయణ కలెక్షన్ల సునామీని సృష్టించడం ఖాయమనే నమ్మకం అందరిలో ఉంది.

 

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.