Home  »  News  »  Rashika Shetty: హీరోయిన్‌కి టార్చర్.. నీ ఫేస్‌కి బంగారు గొలుసు వేసుకునేంత సీన్ ఉందా!

Updated : Apr 1, 2026

 

 

లాస్ట్ ఇయర్ రెండు చిత్రాలతో దుమ్ము లేపింది 
మరి ఎందుకు తనకి అవమానాలు 
పూర్తి మాటర్ చూద్దాం

జీవితమంటే పోరాటం,పోరాటంలో ఉంది జయం.. ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీ కొట్టు.. గట్టిగ పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు.. అని చెప్పుకుంటే వెళ్తుంటే, ఆయనేంటి సార్ పక్కన అందమైన హీరోయిన్ పిక్ పెట్టి నరసింహ మూవీలో రజనీకాంత్ చెప్పిన జీవిత సత్యాన్ని చెప్పుకుంటూ వెళ్తున్నాడు. కొంపతీసి వేరే మాటర్ కి రాంగ్ పిక్ పెట్టాడా అని మానవ ధర్మంగా ఎగతాళి చెయ్యడం మొదలుపెడతారు. కానీ నేను చెప్పేది కరెక్ట్ న్యూస్ నే. మీరు చూస్తున్న పిక్ లో ఉన్న హీరోయిన్  నాకు ఇన్స్పిరేషన్. అసలు మాటర్ తెలిసాక ఇక మనం కూడా ఎవర్ని ఎగతాళి చేయం.

రాశిక శెట్టి.. కన్నడ చిత్ర సీమకి చెందిన ఈ భామ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కొంత ముందైతే నువ్వు యాక్టర్ అవుతావా అని ఎగతాళి చేసారు. ఆడిషన్స్ కూడా చాలా కష్టంగా ఉండేవి. ఎంకరేజ్ మెంట్ ఉండేది కాదు. అవకాశాలు ఇవ్వకపోవడమే కాకుండా సూటి పోటీ మాటలతో ఇబ్బందులు పెట్టేవారు. ఒకసారైతే నీ ముఖానికి బంగారు గొలుసు వేసుకునేంత సీన్ ఉందా అని అన్నారు. దాంతో చాలా బాధపడ్డాను. కానీ ఎవరేం చేసినా, ఎన్ని మాటలు అన్నా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు. వచ్చిన అవకాశాలు చేతి దాకా వచ్చి చేజారిన డోంట్ కేర్ అనుకుని ముందుకు సాగుతూ నాకంటూ ఒక రోజు వస్తుందని అనుకున్నానని చెప్పుకొచ్చింది.

Also read: Ramayana: రాముడి పాత్రని తిరస్కరించిన నేటి అగ్ర హీరో.. ఇక రికార్డులే తరువాయి 

మరి తన ఆత్మ విశ్వాసానికి తగ్గట్టే గత ఏడాది 'మనడ కడలు, నిమ్దే కథే అనే చిత్రాల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. కన్నడ బిగ్ బాస్ 12 వ సీజన్ ని కూడా తన హిస్టరీలో ఉంచుకున్న రాశిక 2014 లోనే  సందేహం అనే మూవీతో తెలుగు సిల్వర్ స్క్రీన్ పై కూడా ల్యాండ్ అయ్యింది.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.