Home  »  News  »  Ramayana: రాముడి పాత్రని తిరస్కరించిన నేటి అగ్ర హీరో.. ఇక రికార్డులే తరువాయి 

Updated : Apr 1, 2026

 


-రాముడితో భారతీయులకి ఉన్న అనుబంధం తెలిసిందే
-మరి రాముడి ఆఫర్ వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా!
-కానీ ఆ హీరో చేయనున్నాడు 
-మరి ఆ తర్వాత ఏం జరిగింది 


భారతీయల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడిపై మూవీ తెరకెక్కించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యి ఒక బడా హీరో చేత శ్రీరాముడిగా చేయించడానికి ప్రిపేర్ అయ్యారు. మరి వాళ్ళు సదరు హీరోని ప్రిపేర్ అయ్యే ముందు ఎన్నో విధాలుగా ఆలోచించే ఆ నిర్ణయం తీసుకుంటారు. పైగా అక్కడ ఉంది శ్రీ రామచంద్రుడు. హీరో లుక్ లో ఏ మాత్రం తేడా వచ్చినా రామభక్తులు, మూవీ లవర్స్, ప్రేక్షకుల ఆగ్రహజ్వాలలకి థియేటర్స్ మొత్తం   మూవీ స్టార్ట్ అయిన మధ్యలోనే ఖాళీ అయ్యే పరిస్థితి. దీన్ని బట్టి కమిట్ మెంట్ స్థాయిని అర్ధం చేసుకోవచ్చు. పైన మనం చెప్పుకున్న న్యూస్ కి ఆద్యుడు రణబీర్ కపూర్(Ranbir kapoor). పూర్తి డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా చేస్తున్న'రామాయణ'(Ramayana)ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. రీసెంట్  రణబీర్ మీడియాతో మాట్లాడుతు నాలుగు సంవత్సరాల క్రితమే నమిత్ మల్హోత్రా రాముడి ఆఫర్ ని తీసుకొచ్చారు. కానీ  తిరస్కరించాను. ఎందుకంటే శ్రీరాముడి వంటి మహోన్నతమైన క్యారక్టర్ ని పోషించే  సామర్థ్యం నాకు ఉందా? ఆ క్యారక్టర్ కి నేను న్యాయం చేయగలనా? అని నన్నునేనే ప్రశ్నించుకున్నాను. అప్పట్లో నా లైఫ్ స్టైల్, నా ఆలోచనలు వేరేలా ఉండేవి. అందుకే సెట్ అవ్వనని నిర్మొహమాటంగా చెప్పేశాను. కానీ నా కూతురు 'రాహా' రాకతో నా ఆలోచనలు మారిపోయాయి. ఒక తండ్రిగా నా బాధ్యతల్ని తెలుసుకున్న తర్వాత శ్రీరాముడి వంటి ఆదర్శవంతుడి క్యారక్టర్ లో చెయ్యడం ద్వారా నన్ను నేను మార్చుకోవచ్చని అనిపించింది. ఈ అవకాశం రావడం కూడా దైవసంకల్పంగా భావించాను. మొదట్లో ఉన్న భయం కాస్తా భక్తిగా, కృతజ్ఞతగా మారిందని  రణబీర్ భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి.

also read: Anjali Nair: హైకోర్టుకి ప్రముఖ నటి అంజలి.. 120 సినిమాల్లో ఏ పేరు ఉంది


ఇక రామాయణని ప్రపంచ సినీ బడ్జెట్ కి ధీటుగా భారతీయ చిత్ర పరిశ్రమలోనే కనివిని ఎరుగని బడ్జెట్ తో నమిత్ మల్హోత్రా నిర్మిస్తుండగా దంగల్ ఫేమ్ నితిన్ తివారి(Nitesh Tiwari) తెరకెక్కిస్తున్నాడు. సాంకేతికత పరంగా కూడా వరల్డ్ సినిమాకి సవాలు విసరనుంది. రావణుడుగా కన్నడ రాకింగ్ స్టార్ యష్(Yash)హనుమంతుడిగా సన్నీడియోల్(Sunny Deol)చేస్తుండటం రామాయణ స్పెషల్. ఆస్కార్ విన్నర్స్ హన్స్ జిమ్మెర్, ఏఆర్ రెహమాన్(Ar Rehman)సంయుక్తంగా మ్యూజిక్ ని అందిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే రిలీజైన గ్లింప్స్రికార్డులు సృష్టించే పనిలో ఉన్నాయి. సదరు రికార్డ్స్ రాముడి పాదాల చెంతకి చేరే ఉంటాయి. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కనున్న రామాయణ ఈ ఏడాది దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండవ భాగం రిలీజ్ కానున్నాయి.

 

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.