Home  »  News  »  Leader: అప్పుడు లెజెండ్.. ఇప్పుడు లీడర్.. యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ అదిరిపోయింది!

Updated : Mar 30, 2026

  • బిజినెస్ టైకూన్ నుంచి మాస్ హీరోగా 
  • 'లీడర్' ట్రైలర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న లెజెండ్ శరవణన్
  • పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా 'లీడర్'

కోలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బిజినెస్ మాగ్నెట్ కమ్ యాక్టర్ లెజెండ్ శరవణన్(Legend Saravanan) మళ్ళీ వార్తల్లో నిలిచారు. తన మొదటి సినిమా 'ది లెజెండ్'తో వెండితెరపై సందడి చేసిన ఆయన, ఇప్పుడు 'లీడర్' (Leader) అనే పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దర్శకుడు ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. భారీ హంగులు, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లతో కూడిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్రైలర్ హైలైట్స్ ఇవే..
ఈ 'లీడర్' ట్రైలర్‌ను గమనిస్తే, శరవణన్ మరోసారి ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది. సమాజంలో జరిగే అన్యాయాలను ఎదిరించే వ్యక్తిగా ఆయన కనిపిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే విజువల్స్, భారీ తారాగణం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా శరవణన్ తనదైన శైలిలో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ కనిపించడం అభిమానులను అలరిస్తోంది. ట్రైలర్ క్వాలిటీ చూస్తుంటే మేకర్స్ ఎక్కడా ఖర్చుకు వెనకాడలేదని అర్థమవుతోంది.

ట్రైన్ లో జరిగే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ యాక్షన్ ట్రైలర్ ప్రారంభమవుతుంది. 'ఈ ప్రపంచంలో ఏ సహాయం దేవుడు నేరుగా చేయడు, మనుషుల మూలంగానే అన్ని మంచి పనులు జరుగుతాయి, మనం వాళ్లనే నమ్మాలి...' అనే డైలాగ్ కథానాయకుడి ఆలోచనను, దృక్ఫథాన్ని తెలియజేస్తుంది. ట్రైలర్ చివరలో వచ్చిన తండ్రీ, కూతురు ఎమోషనల్ సీన్ హార్ట్ టచింగ్ గా ఉంది. భారీ యాక్షన్, సెంటిమెంట్ తో పాటు అన్ని కమర్షియల్ హంగులతో "లీడర్" సినిమా ప్రేక్షకుల్ని థియేటర్స్ లో అలరించనున్నట్లు ఈ యాక్షన్ ట్రైలర్ తో తెలుస్తోంది.

లెజెండ్ శరవణన్ సినీ ప్రస్థానం..
దక్షిణాదిలో ప్రముఖ వ్యాపారవేత్తగా సుపరిచితులైన శరవణన్ అరుల్, సినిమాలపై ఉన్న మక్కువతో హీరోగా మారారు. ఆయన తొలి చిత్రం 'ది లెజెండ్' భారీ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ, నిరుత్సాహపడకుండా తన రెండో ప్రయత్నంగా 'లీడర్'ను పట్టాలెక్కించారు. మొదటి సినిమా కంటే ఈసారి మరింత జాగ్రత్తగా, కథాబలం ఉన్న స్క్రిప్ట్‌ను ఎంచుకున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.

భారీ తారాగణం.. అదిరిపోయే విజువల్స్
ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. శామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రైన్ లో, పోర్ట్ ఏరియాలో, ఫారెస్ట్ లో జరిగే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాలోని గ్రాండియర్ మేకింగ్ ను చూపిస్తున్నాయి. యాక్షన్ డైరెక్టర్లు డిజైన్ చేసిన ఫైట్ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్‌కు ఐ ఫీస్ట్‌లా ఉండబోతున్నాయి అనిపిస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్..
ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. నెటిజన్లు శరవణన్ స్క్రీన్ ప్రెజెన్స్‌పై రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆయన డెడికేషన్‌ను మెచ్చుకుంటుంటే, మరికొందరు ఈసారి బాక్సాఫీస్ వద్ద గట్టిగానే కొట్టేలా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్ ద్వారా కూడా ఈ సినిమాకు మంచి ప్రచారం లభిస్తోంది.

ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలో అడుగుపెట్టనుంది. మరి 'లెజెండ్'తో హిట్ అందుకోలేకపోయిన లెజెండ్ శరవణన్.. ఈ 'లీడర్'తో హిట్ అందుకుంటారేమో చూడాలి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.