Home  »  News  »  Peddi: పెద్ది గ్లింప్స్ రిలీజ్.. స్పష్టంగా తెలుస్తున్న పెద్ది పొగరు 

Updated : Mar 27, 2026

 

 

-బర్త్ డే కి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చిన చరణ్ 
-గ్లింప్స్ తో పెద్ది ఎలా ఉండబోతుందో తెలిసిపోయింది 
-చూడుమే ఆటే నా పొగరు 


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)తన బర్త్ డే కానుకగా అభిమానులకి ట్రీట్ ఇస్తు పెద్ది(Peddi)గ్లింప్స్ తో బరిలోకి దిగాడు. దిగడమే కాదు ఏప్రిల్ 30 న వరల్డ్ వైడ్ థియేటర్స్ మొత్తం పెద్ది నామజపంతో ఉగిపోవడం ఖాయమనే సంకేతాలు చాలా స్పష్టంగా ఇచ్చాడు.  గ్లింప్స్ చూసిన అభిమానులు అయితే ఈ రోజు శ్రీరామనవమి కావడంతో పెద్ది యాసలోనే మాట్లాడుతు ఏప్రిల్ 30 త్వరగా వచ్చేలా చేయమని శ్రీరాముడు, ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నారు. మరి గ్లింప్స్ ఎలా ఉందో మనం కూడా ఒక లుక్ వేద్దాం.

సుమారు నిమిషం నలభై సెకన్ల నిడివితో ఉండగా రామ్ చరణ్ కుస్తీ వీరుడు గెటప్ లో కండలు తిరిగిన దేహంతో ఉన్నాడు. బంతితో బాట్ కి ఎదురెళ్ళే ఆట కాదురా ఇది. పాణంతో చావుకి ఎదురిల్లే ఆట. ఇప్పుడు చెప్పు ఉంటావా పోతావా అని ఉత్తరాంధ్ర యాసలో వాయిస్ వచ్చింది. చరణ్ పోటీలోకి సింహంలా దూకి 'చూడుమే ఆటే నా పొగరు   అని చెప్పాడు.  ఇప్పుడు గ్లింప్స్ చూస్తుంటే తొలి నుంచి పెద్ది పలు రకాల ఆటల్లో నైపుణ్యం ప్రదర్శించే ఆటగాడనే వస్తున్న వార్తలు నిజమయ్యాయి. అలాగే గతంలో రిలీజ్ చేసిన  గ్లింప్స్ లో ఒకేలా బతికెయ్యడానికి మళ్ళీ పుడతామా యేటి అనే పెద్ది మాటకి జస్టిఫై ఇచ్చినట్లయింది.

ఇక ఈ గ్లింప్స్ తో పెద్ది కోసం దర్శకుడు బుచ్చిబాబు(Buchhibabu)తో పాటు టీం మొత్తం ఏ విధంగా కష్టపడుతుంది. ముఖ్యంగా చరణ్ కష్టం యొక్క స్థాయి ఎలా ఉందో కూడా అర్ధమవుతుంది. పైగా పలు రకాల ఆటగాడు అంటే ఆ ఆటకి తగ్గ బాడీని మైంటైన్ చెయ్యాలి. దీంతో మెగా పవర్ స్టార్ అనే టాగ్ లైన్ తో పాటు డై హార్ట్ ఫ్యాన్స్ ఊరికే పుట్టరనే   విషయం కూడా ఆర్డమవుతుంది. ఏ ఆర్ రెహ్మాన్(Ar Rehman)బ్యాక్ గ్రౌండ్ స్కోర్  ఏ రేంజ్ లో  ఉండబోతుందో స్పష్టంగా చెప్పిన టీజర్ నిమిషాల్లోనే రికార్డు వ్యూస్ తో పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతుంది. రామ్ చరణ్ గధని చేతబూని ఆంజనేయాడులా నిలబడటం పెద్ది గ్లింప్స్ స్పెషల్.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.