Home  »  News  »  Papam Prathap Teaser: పాపం ప్రతాప్.. పెళ్ళయిన మూడు రోజులకే లోపం బయటపడింది!

Updated : Mar 26, 2026

  • వినోదాల విందులా 'పాపం ప్రతాప్' టీజర్ 
  • అసలు ప్రతాప్ సమస్య ఏమిటి?

విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తిరువీర్. ముఖ్యంగా గతేడాది 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు 'పాపం ప్రతాప్' సినిమాతో మరోసారి నవ్వులు పూయించడానికి రెడీ అయిపోయాడు. ఈటీవీ విన్ నుంచి వస్తున్న సినిమా కావడం అదనపు ఆకర్షణ. ఎస్పీ దుర్గ నరేష్ దర్శకత్వంలో వస్తున్న 'పాపం ప్రతాప్' టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. (Papam Prathap Teaser)

'పాపం ప్రతాప్' ఎంటర్టైనింగ్ గా ఉంది. ప్రతాప్ గా తిరువీర్ బాగానే నవ్వించాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ప్రతాప్. మొదటి మూడు రాత్రులు తన ప్రతాపాన్ని చుపించానంటూ మురిసిపోతాడు. కానీ, ఆ తర్వాతే అసలు బొమ్మ మొదలవుతుంది. ప్రతాప్ తో సమస్య ఉందంటూ అతని భార్య ఊరి పెద్దల ముందు పంచాయితీ పెడుతుంది. "ప్రతాప్ గదిలో మంచం పైన" అంటూ సమస్యను అర్థమై అర్థం కానట్టుగా చెబుతుంది. దీంతో ఊరంతా ప్రతాప్ కి లోపం ఉంది అనుకుంటుంది. అసలు ఆ సమస్య ఏంటి? ప్రతాప్ లో నిజంగానే లోపం ఉందా? అనే ఆసక్తిని కలిగిస్తూ టీజర్ ను సరదాగా కట్ చేశారు.

ఈ టీజర్ చూస్తుంటే ఇది కేవలం కామెడీ సినిమా మాత్రమే కాదు, ఇందులో ఆసక్తికర కథ ఉందని అర్థమవుతోంది. ప్రతాప్ గదిలో ఏం చేస్తున్నాడు? మంచం మీద ఎందుకు అలా ఉన్నాడు? వంటి ప్రశ్నలు తలెత్తేలా కొన్ని హిడెన్ హింట్స్ వదిలారు. ప్రతాప్‌లో ఏదో లోపం ఉందా అన్న కోణంలో సాగే సీన్లు ప్రేక్షకులలో ఒక రకమైన క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

ప్రతి ఫ్రేమ్‌లోనూ నవ్వులతో పాటు ఒక తెలియని మిస్టరీని దాచి ఉంచినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో "అది పనిచేస్తుందా?" అని అడిగే సీన్ టీజర్‌కే హైలైట్ అని చెప్పవచ్చు. ఈ ఒక్క డైలాగ్‌తో సినిమా ఏ రేంజ్ కామెడీని పంచబోతుందో హింట్ ఇచ్చేశారు.

టీజర్‌లో విజువల్స్ పల్లెటూరి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్‌ను ఎలివేట్ చేస్తూ హై ఎనర్జీని ఇస్తోంది. సినిమాటోగ్రఫీ చాలా సహజంగా ఉంది. 

మొత్తానికి 'పాపం ప్రతాప్' టీజర్ ప్రేక్షకులకు ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ ప్రామిస్ చేస్తోంది. ఏప్రిల్ 17న థియేటర్లలో సందడి చేయడానికి వస్తున్న 'పాపం ప్రతాప్'.. ఈ వేసవిలో బాక్సాఫీస్ వద్ద నవ్వుల జల్లు కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

https://x.com/etvwin/status/2036794487939473882






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.