![]() |
![]() |

-అల్లు అర్జున్ చిత్రాల కొత్త కబురు ఏంటి
-అట్లీ మూవీ ఎక్కడ దాకా వచ్చింది
-లోకేష్ కనగరాజ్ మూవీ అప్ డేట్ ఏంటి!
-అభిమానులు ఏం కోరుతున్నారు
హీరోలపై ఫ్యాన్స్ కి ఉండే అభిమానం చూస్తే మన రెండు కళ్ళు సరిపోవు. అంతలా తమ అభిమాన హీరోని ఆరాధిస్తారు. అలాంటి అభిమానులని పొందటం హీరోలకి ఆ దేవుడు ఇచ్చిన వరంగా కూడా భావించవచ్చు. అలాంటి హీరోల్లో పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కూడా ఒకరు. ప్రెజెంట్ అట్లీతో చేస్తున్న మూవీతో బిజీగా ఉన్నాడు. మరో క్రేజీ కాంబో లోకేష్ కనగరాజ్ మూవీ కూడా అనౌన్స్ చేసాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా గత కొన్ని రోజుల నుంచి అభిమానులు స్పందిస్తు 'సదరు చిత్రాల అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండవచ్చు కదా! అట్లీ మూవీ నుంచి పిక్స్ రిలీజ్ చెయ్యచ్చు కదా! అని అడుగుతున్నారు. మేకర్స్ నుంచి స్పందన లేకపోయే సరికి ఆ అందరు సినీ అలకతో ఉన్నారు. అలాంటి వారందరి కోసం మా తెలుగు వన్ ఛానల్ ఎక్స్ క్లూజివ్ గా సమాచారాన్ని ఇస్తుంది. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
అల్లు అర్జున్ పుట్టిన రోజు ఏప్రిల్ 8 .. ఆ రోజున అట్లీ(Atlee Kumar)మూవీ నుంచి లుక్ రిలీజ్ కానుంది. దాంతో పాటు టైటిల్, రిలీజ్ డేట్ ఇతర తారాగణాన్ని ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టుగా టాక్ . ఆల్ రెడీ ఇందుకు సంబంధించిన పనులు కూడా జరుగుతునట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే రోజు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)మూవీ షూట్ కూడా మొదలుకానుందని సమాచారం. ఈ రెండు సినిమా విశేషాలే కాదు, అల్లు అర్జున్ లైనప్ లో ఉన్న మరిన్ని సినిమాల లిస్ట్ కూడా వెల్లడి చేసే అవకాశం ఉంది. దీంతో అల్లు అర్జున్ బర్త్ డే రోజున అభిమానుల జోష్ మరింత రెట్టింపు అవ్వడం ఖాయం.
also read: Ustaad Bhagat Singh: 2 nd డే కలెక్షన్స్ ఇవేనా!.. హిట్టా! ప్లాపా!
ఇప్పుడు తెలుగు వన్(Telugu One)సైట్ లో వస్తున్న ఈ న్యూస్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తెలుగు వన్ కి థాంక్స్ చెప్తున్నారు. సదరు లైనప్ తో రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ ని చెడుగుడు ఆడుకోవడం ఖాయం.
![]() |
![]() |