Home  »  News  »  Siddhu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ కొత్త మూవీ ఇదే.. సాహూ లాంటి ఆఫర్ అవుతుందా! 

Updated : Mar 20, 2026

 

 

-వరుస పరాజయాలలో సిద్దు 
-ఈ సారి హిట్ అందుకుంటాడా!
-డైరెక్టర్ ఎవరు


డిజె టిల్లు గత ఏడాది జాక్, తెలుసు కదా చిత్రాలతో  పరాజయాలని అందుకొని మినిమమ్ గ్యారంటీ హీరో అనే టాగ్ లైన్ నుంచి కొంచం పక్కకి జరగాల్సిన పరిస్థితి. దీంతో టిల్లు నుంచి నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుంది, అసలు టిల్లుకి సంబంధించిన అప్ కమింగ్ సినిమాల పరిస్థితి ఏంటని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తిష్ట వేసుకొని కూర్చుకున్నారు. ఈ క్రమంలో ఒక ఆసక్తికర న్యూస్ వాళ్ళని ఆకట్టుకుంటుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం

సిద్దు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda)తన కొత్త మూవీని నిన్న ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసాడు. సితార ఎంటర్ టైన్ మెంట్ పై నాగవంశీ నిర్మిస్తుండగా, అనిల్ కుమార్(Anilkumar)దర్శకుడిగా తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న్నాడు. అనిల్ కుమార్ గతంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఓజి సుజిత్ కాంబోలో వచ్చిన సాహూకి అసోసియేట్ డైరెక్టర్, సహరచయితగా వర్క్ చేసాడు.  స్క్రీన్ ప్లే పరంగా గాని, టేకింగ్ పరంగా గాని సాహూ ఎంతో స్టైలిస్ట్ గా సాగుతుంది. ఈ నేపథ్యంలో సదరు కొత్త చిత్రం టిల్లు అభిమానుల్లో క్రేజీ ప్రాజెక్ట్ గా మారింది.


Also read: Ustaad bhagat singh: ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ డే టాక్ పరిస్థితి ఇదే.. బయట పడేస్తుందా!


డిజె టిల్లు, టిల్లుస్క్వేర్ తో కథ, కథనాలు, డైలాగ్ డెలివరి, బాడీ లాంగ్వేజ్ పరంగా సిద్దు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. కానీ జాక్, తెలుసు కదా చిత్రాలలో రెగ్యలర్ లవర్ బాయ్ గా చేసాడు. ఆ రెండు పరాజయం చెందటంతో ఇప్పుడు అనిల్ కుమార్ మూవీ ఎలాంటి కథతో వస్తుందనే ఆసక్తి అందరిలో ఉంది. నెక్ట్ మంత్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుందనేది టాక్. హీరోయిన్ తో పాటు మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. సిద్దు జొన్నల గడ్డ కెరీర్ లోనే హై బడ్జెట్ తో రూపొందుతుంది. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.