Home  »  News  »  Rajinikanth: భయపడ్డానా!.. టివికె పార్టీకి కౌంటర్ ఇస్తు లెటర్ రిలీజ్ చేసిన రజినీ 

Updated : Mar 17, 2026

 

-రెండు రోజుల క్రితం టివికె పార్టీ నేత కీలక వ్యాఖ్యలు 
-లెటర్ రిలీజ్ చేసిన రజనీ
-అభిమానులు ఇప్పుడు ఏమంటారు

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajikanth)గురించి ఇళయ దళపతి విజయ్(VIjay)కి చెందిన టివికె(TvK)పార్టీ ముఖ్య నేత ఆదవ్ అర్జున్ రెండు రోజుల కిందట మాట్లాడుతు విజయ్ కి  ఉన్న గుండె ధైర్యం రజనీకాంత్‌కి లేదు. అందుకే  డిఏంకె పార్టీకి భయపడి రజనీ రాజకీయాల నుంచి తప్పుకున్నాడనే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మాటలపై రజినీకాంత్ ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. మరి అందులో ఏముందో చూద్దాం.
  

నాపై టివికె పార్టీ ముఖ్య నేత ఆదవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలలో ఎంత మాత్రం నిజం లేదు వాస్తవాలకి విరుద్ధంగా ఆ మాటలు ఉన్నాయి. వాటికి కాలమే సమాధానం చెబుతుంది. ఈ విషయంలో నాకు మద్దతుగా నిలుస్తు నా కోసం గొంతు ఎత్తిన మీడియా మిత్రులకి, ప్రాణ సమానమైన అభిమానులకి థాంక్స్ .ముఖ్యంగా తమిళనాడు ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, బీజేపీ నేతలు మరియు ఇతర రాజకీయ ప్రముఖులు కూడా నాపై వచ్చిన వార్తలని ఖండించినందుకు ధన్యవాదాలు. "కాలం మాట్లాడదు.. కానీ అది వేచి చూసి సరైన సమయంలో జవాబిస్తుంది" అనే పవర్‌ఫుల్ కొటేషన్‌తో రజనీ తన భావాన్ని ముగించాడు.


also read: Allu arjun: పేరెంట్స్ చనిపోవడంతో హోటల్‌లో అల్లు అర్జున్ క్లాస్‌మేట్‌


సూపర్ స్టార్ 'రజనీకాంత్' అనే పేరుకి ఉన్న చరిష్మాని చెప్పడం స్టార్ట్ చేస్తే చిన్న పిల్లలు సైతం మనల్ని కూర్చోబెట్టి ఆయన మొదట సినిమా నుంచి మొన్న వచ్చిన 'కూలీ' వరకు రజనీ సాధించిన రికార్డులని పొల్లు పోకుండా చెప్తారు. ఇది రజనీకి మాత్రమే దక్కిన అభిమాన సినీ వరం. అంతటి శక్తీ ఉన్న రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కోరుకొని అభిమాని లేడు. రజనీ కూడా రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి ఆ వెంటనే విరమించుకున్నాడు. కానీ అనారోగ్య కారణాల వల్లనే విరమణ నిర్ణయం తీసుకుంటున్నానని స్వయంగా రజనీ నే ప్రకటించాడు. తమిళనాడు గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ విషయం మొత్తం జరిగింది. 

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.