Home  »  News  »  Rashmika Mandanna: రష్మిక ఆసక్తికర పోస్ట్.. ఆ హీరో నా టీం మెంబర్

Updated : Mar 17, 2026

 

 

-రష్మిక, విజయ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు
-ఇప్పుడెందుకు రష్మిక పోస్ట్ చేసింది
-సదరు పోస్ట్ ఆంతర్యమేంటి!


ప్రేమ సఫలమై పెళ్లి చేసుకున్న జంట మనస్ఫూర్తిగా ఎంత ఆనందంగా అయితే  ఉంటుందో  విజయ్(Vijay deverakonda),రష్మిక(Rashmika)దేవరకొండని చూస్తే అర్ధం అవుతుంది. వివాహం జరిగే రోజుకి  ముందు నుంచే పలు రకాల ఫంక్షన్స్ ని ఏర్పాటు చేసి ఆ సంతోషకరమైన క్షణాలు తమ నుంచి దూరం కాకుండా లైఫ్ లాంగ్ తోడుండాలనే ఆకాంక్ష వాళ్ళ ముఖాల్లో స్పష్టంగా కనపడింది. ఈ క్రమంలో హల్ది వేడుక కూడా జరుపుకున్నారు. అందుకు సంబంధించి జరిగిన ఒక సంఘటన గురించి రష్మిక రీసెంట్ గా పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పోస్ట్ విజయ్, రష్మిక మధ్య ఉన్న అండర్ స్టాండ్ కి ప్రతిరూపంగా నిలుస్తుంది. మరి అదేంటో చూద్దాం.

రష్మిక ఎక్స్ వేదికగా తన పోస్ట్ లో హల్దీ వేడుక హోలీ ని తలపించింది. నా జుట్టుపై పడిన రంగు ఇప్పటికి పోలేదు. ఆ రోజు నిర్వహించిన అన్ని పోటీల్లో నేనే గెలిచాను. నా టీం సహకారం వల్లే అది సాధ్యమయ్యింది. విజ్జు కూడా నా టీంనే అని తెలిపింది. ఈ విషయంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'రష్మిక,విజయ్ నిజంగా గ్రేట్. పోటీల్లో ఇద్దరు అపోజిట్ గా ఉండకుండా ఓకే జట్టులో ఆడి గెలవడం చూస్తుంటే ఆ ఇద్దరు సరదాగా కూడా ప్రత్యర్థులుగా ఉండటానికి ఇష్టపడలేదనే కామెంట్స్ చేస్తున్నారు.


Also read: Ustaad Bhagat singh: ఉస్తాద్ ఊచకోత స్టార్ట్.. ఆ ఏరియాలో రికార్డుల వేట 


ఇక ఈ ఇద్దరు అభిమానుల ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేలా 'రణబలి' మూవీలో జంటగా చేస్తున్నారు. పెళ్లి తర్వాత వస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. ఆ ఇద్దరి కాంబోలో వస్తున్న మూడవ సినిమా రణబలి. 

  






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.