![]() |
![]() |

-రేపు బెనిఫిట్ షో నుంచి ఉస్తాద్ స్టార్ట్
-అభిమానుల్లో భారీ అంచనాలు
-పవన్ సాధించిన రికార్డు ఎక్కడ!
'ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా' అనే వర్డ్ కి తగ్గట్టుగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తన 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh)తో రిలీజ్ కి ముందే అభిమానులు కాలర్ ఎత్తుకునేలా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకోవడమే ఇందుకు సాక్ష్యం. ఆ రికార్డు తాలూకు స్వరూపాన్ని చూసేద్దాం.
నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ 250K డాలర్ల మార్కుని దాటేశాయి. ప్రీమియర్లకి ఇంకా ఒక రోజు సమయం ఉండగానే ఆ స్థాయి వసూళ్లు రావడం యుఏస్ బాక్సాఫీస్ వద్ద ఉస్తాద్ సృషించబోయే సునామీకి సంకేతంగా భావించవచ్చు. మరి ఈ లెక్కన ఫస్ట్ డే సంబంధించి ఓవర్సీస్ లో పవన్ ఎంటైర్ కెరీర్ లోనే సరికొత్త రికార్డులు నెలకొల్పుతాడనే అభిప్రాయాన్ని అభిమానులతో పాటు ఉస్తాద్ ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రత్యంగిరా సినిమాస్ భావిస్తుంది.
also read: Roja: ప్రముఖ హీరో ఇంటికి కోడలుగా రోజా కూతురు.. ఆ హీరో ఈయనేనా!
ఇక తెలుగు నాట కూడా నిన్న ఈవినింగ్ నుంచి బుకింగ్స్ స్టార్ట్ చేయగా, నిమిషాల్లోనే హాట్ కేక్స్ లాగా టికెట్స్ అయిపోతున్నాయి. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్, హరీష్ శంకర్(Harish Shankar),శ్రీలీల(Sreeleela),రాశిఖన్నా(Raashii Khanna), మైత్రి మూవీస్ అధినేతలు నవీన్(Naveen),రవిశంకర్(Ravishankar)స్పీచ్ తర్వాత అభిమానులైతే ఉస్తాద్ ఎలా ఉండబోతుందో అని తన శక్తీ కొలది ఊహించుకుంటున్నారు. ఉగాదికి వెల్ కమ్ చెప్తూ 19 న ఎంట్రీ ఇస్తున్నా 18 నుంచే ప్రీమియర్స్ ప్రదర్శించనున్న విషయం తెలిసిందే.

![]() |
![]() |