Home  »  News  »  Varanasi: వారణాసి టీంకి షాక్! అక్రమం అని తేల్చి ప్రముఖ నటుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు  

Updated : Mar 16, 2026

 


 
-షూటింగ్ లో వారణాసి
-తెలుగు వారి ప్రెస్టేజియస్ట్ మూవీ 
-ఎందుకు అరెస్ట్ చేసారు!

'వారణాసి'(Varanasi).. ఏ ముహూర్తాన మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(ss Rajamouli), విజయేంద్రప్రసాద్, కేఎల్ నారాయణ తమ సినిమాకి 'వారణాసి' అనే టైటిల్ ని ఫిక్స్ చేసారో కానీ, వారణాసి అప్ డేట్స్ చూడకుండా నిద్రపోని పాన్ ఇండియా ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి లేదు. టేకింగ్, టెక్నీకల్, బడ్జెట్, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కూడా తెలుగు సినిమా ఖ్యాతిని   వరల్డ్ సినీ మేకర్స్ ముందు వారణాసి ద్వారా సాక్షాత్కారం కానుంది. ఇంతటి ప్రతిష్టాత్మక మూవీ ఒక వ్యక్తి వలన ఎక్స్ క్లూజివ్ గా వైరల్ గా నిలిచింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.  

విక్టరీ అపుయామగన్‌..ఉరఫ్ కెన్నీ(kenni). నైజీరియా దేశస్థుడు. ఎలాంటి అనుమతులు లేకుండానే సుమారు ఎనిమిదేళ్లుగా మన దేశంలో నివసిస్తున్నాడు. అంటే  అక్రమంగా స్టే చేస్తున్నాడు. మొన్న  మార్చి 14 న హైదరాబాద్ లోని కొండాపూర్ ఏరియాలో తెలంగాణ స్పెషల్ వింగ్ ఈగల్ ఫోర్స్ (EAGLE Force) సభ్యులు కెన్నీని అరెస్ట్ చేసారు.  దీంతో కెన్నీ గురించిన వివరాలన్నీ బయటకి వచ్చాయి. కెన్నీ 2018 నవంబర్ లో 'ఘనా' దేశానికి చెందిన పాస్‌పోర్ట్ సంపాదించి యాకూబ్ అలీ అనే పేరుతో మెడికల్ అటెండెంట్ వీసాపై న్యూఢిల్లీకి వచ్చాడు. 2019  జనవరిలోనే సదరు వీసా గడువు ముగిసింది. కానీ తిరిగి వీసా పొడిగించుకోకుండా అక్రమంగా ఉండిపోయాడు. దీంతో హైదరాబాద్ పోలీసులు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) అధికారులకి  అప్పగించారు. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకపోవడం మరియు ఫోర్జరీ పాస్‌పోర్ట్ కలిగి ఉండటంతో పట్టుబడ్డ శనివారమే  నైజీరియాకి పంపించేశారు. 

also read: Ustaad Bhagat Singh vs dhurandhar 2: ఎవరి పెర్ ఫార్మెన్స్ బద్దలు కాబోతుంది


మొదట పంజాబ్ లోని 'లూథియానా' లో జిమ్ ట్రైనర్‌గా పనిచేసి సెప్టెంబర్ 2025లో నటనపై ఆసక్తితో హైదరాబాద్‌(HYderabad)కి మారి కొండాపూర్ లో ఉన్న ఒక పీజీ హాస్టల్‌లో ఉంటు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు. దీంతో సుమారు ఐదు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. ప్రస్తుతం వారణాసిలో  ఒక క్యారక్టర్ చేస్తున్నాడు. మరి  వారణాసిలో కెన్నీ ఎటువంటి రోల్ లో కనిపిస్తున్నాడు. అతని రోల్ పూర్తయిందా లేదా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. కెన్నీ విషయంపై వారణాసి టీం ఇంతవరకు స్పందించలేదు. ఇటీవల విడుదలైన 'తస్కరి' హిందీ మూవీ కూడా కెన్నీ లిస్ట్ లో ఉంది.

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.