Home  »  News  »  Ustaad Bhagat Singh: అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు పవన్ కళ్యాణ్.. బిజీ అవ్వడం ఖాయమా!

Updated : Mar 16, 2026

 

 

-నిన్న జరిగిన ఉస్తాద్ ప్రీ  రిలీజ్ ఈవెంట్ 
-అందరిలో మూవీపై భారీ అంచనాలు
-తాను మళ్ళీ బిజీ అవుతుందా!

 

ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagath SIngh)పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawak Kalyan)అభిమానుల ఫోకస్ మొత్తం ఇప్పుడు బుక్ మై షో తో పాటు ఆన్ లైన్ టికెట్స్ యాప్స్ పై ఉంది. ఉగాది సందర్భంగా ఈ నెల 19 న థియేటర్స్ లోకి అడుగుపెడుతున్నా కూడా, ముందు రోజు బెనిఫిట్ షో ఉండటంతో ఏ నిమిషాన ఆన్ లైన్ లో లోడ్ చేస్తారో, ఏ మాత్రం అశ్రద్ధ చేసినా ఎక్కడ టికెట్స్ అయిపోతాయో అనే చిన్నపాటి దిగులు కూడా వాళ్ళల్లో ఉంది. దీంతో ఎన్ని పనులు ఉన్నా ఫోన్ ని మాత్రం వదలడం లేదు. మరో వైపు నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోని అందరి స్పీచ్ లని మరోసారి మననం చేసుకుంటు 'ఉస్తాద్' అందరికి మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆ లిస్ట్ లో రాశి ఖన్నా కూడా ఉంది. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  ఆమె మాటలు చూద్దాం.


రాశి ఖన్నా(Raashii Khanna)మాట్లాడుతు కెరీర్ ప్రారంభం నుంచి పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించాలని కోరిక ఉండేది. ఉస్తాద్ భగత్ సింగ్ తో నా కల నెరవేరింది. . పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ నిజ జీవితంలో సింపుల్ గా ఉంటారు. ఒక వ్యక్తిగా నాలో ఎంతో స్ఫూర్తిని నింపారు. చాలా తక్కువ మాట్లాడతారు కానీ ప్రతి మాటలో విలువ ఉంటుంది. అంతటి   గొప్ప స్టార్ తో స్క్రీన్ ని పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నాను.  నాకు ఈ అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్(Harish Shankar)గారికి ధన్యవాదాలు. ఉస్తాద్ కోసం ఎంత కష్టపడ్డారో నేను కళ్లారా చూశాను. గబ్బర్ సింగ్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందనే నమ్మకం నాలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో పని చేయడం సంతోషంగా ఉంది. ఆ సంస్థలో మరిన్ని సినిమాలు చేయాలి. శ్రీలీల స్వీట్ హార్ట్. తనతో వర్క్ చేయడం చాలా బాగుందని  రాశి ఖన్నా చెప్పుకొచ్చింది.

Also read: Ustaad Bhagat Singh: ఈ సారి నిలబడతాడా! ఆ స్పీచ్ ఏంటి స్వామి 

ఢిల్లీకి చెందిన రాశి ఖన్నా 2014 లో ఊహలు గుసగుసలాడేతో తెలుగు సిల్వర్ స్క్రీన్ పై టేక్ ఆఫ్ అయ్యింది. సుప్రీమ్, ప్రతి రోజు పండగే తర్వాత చేసిన వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్ సినిమాలతో పాటు గత ఏడాది చేసిన 'తెలుసు కదా' వరకు పరాజయాలని ఎదుర్కొంది. సినిమాల లిస్ట్ కూడా అంత పెద్దగా లేదు. ఎన్టీఆర్ తో చేసిన జై లవకుశ హిట్ తో తెలుగుతో పాటు ఇతర బాషల్లోను వరుస అవకాశాలని దక్కించుకుంది. మరి ప్రస్తుతం డల్ గా ఉన్న రాశి ఖన్నా కెరీర్ కి  పవన్ తన ఉస్తాద్ భగత్ సింగ్ తో మళ్ళీ జోరుని అందిస్తాడేమో చూడాలి.  

 

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.