Home  »  News  »  UStaad Bhagat Singh: మహేష్‌బాబు ఫ్యాన్స్‌కి క్షమాపణలు.. ఉస్తాద్ భగత్‌సింగ్‌కి మద్దతు ఇస్తారా!

Updated : Mar 11, 2026

 

 

-ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది ఎవరు!
-నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఎం జరుగుతుంది
-ఈ నెల 19 న సునామి ఖాయమా!

హరీష్ శంకర్(Harish Shankar).. గబ్బర్ సింగ్ తో తాను లైమ్ లైట్ లోకి రావడమే కాదు, 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)ని వరుస పరాజయాల నుంచి విముక్తుడి చేసి, పవన్ కట్ అవుట్ కి సరికొత్త కంటెంట్, రికార్డులని పరిచయం చేసాడు. దీంతో ఆ ఇద్దరి కాంబోలో ఈ నెల 19 న ల్యాండ్ అవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాల స్థాయి రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ అంతకు అంత పెరుగుతుంది. నిన్నటి వరకు వచ్చిన కాలర్ ఎగరెయ్యరా సాంగ్ ప్రోమోనే ఉదాహరణ. దీంతో మూవీకి సంబంధించిన  మరిన్ని అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి, నెటిజెన్స్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి హరీష్ శంకర్ క్షమాపణలు చెప్పిన న్యూస్ వైరల్ గా మారింది. మరి సదరు పూర్తి న్యూస్ ఏంటో చూద్దాం.

ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat singh)రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమాని ట్విట్టర్ లో ఈసారి బాక్సాఫీస్ వద్ద BoB రికార్డులు కూడా లేచిపోవాలంటూ కామెంట్ చేశాడు. సదరు ట్వీట్‌ కి “తథాస్తు” అంటు హరీష్ శంకర్ రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు ఈ రిప్లై పైనే మహేష్ బాబు ఫాన్స్ గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే BoB అనే వర్డ్ ని Boss of Blockbusters గా మహేష్ బాబు ఫ్యాన్స్ ఉపయోగిస్తూ ఉంటారు. దీంతో మహేష్ బాబు రికార్డులని కించపరిచే ప్రయత్నం అంటు కొంత మంది ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.హరీష్ శంకర్‌ కి   పొగరెక్కిందని క్షమాపణ చెప్పకపోతే ‘ ఉస్తాద్ భగత్‌సింగ్ ’ ని బాయ్‌కాట్ చేస్తామంటూ పోస్టులు కూడా చేస్తున్నారు. అలాంటి ఈ టైంలో హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా ఒక నోట్ రిలీజ్ చేసాడు. ససారు నోట్ లో 'మహేష్ బాబుపై నాకు ఎంతో గౌరవం ఉంది  ‘నిన్న నాకు చాలా బిజీగా గడిచింది. మూవీ విజయవంతమవ్వాలని ఆశీర్వాదాల కోసం పెద్దమ్మ గుడిని సందర్శించాను. సెన్సార్ తర్వాత బోర్డ్ అధికారులతో మీటింగ్ జరిగింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకున్నాను.

నిన్న రిలీజైన ప్రోమోకి  సంబంధించిన ఫైనల్ చెక్స్ పూర్తి చేశాను. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ దగ్గరకి వెళ్లాను. మరో పక్క ప్రోమోని మెచ్చుకుని శుభాకాంక్షలు పంపుతున్న జర్నలిస్టులు, స్నేహితులు, అభిమానులకి కూడా నేను సమాధానాలు ఇస్తూ ఉన్నాను. ఆ హడావుడిలో ఒక ట్వీట్‌ ని పూర్తిగా చదవకుండానే పొరపాటున కోట్ చేశాను. ఆ వెంటనే అభిమాని చేసిన  ట్వీట్‌ని పూర్తిగా చదవమన్నారు. వెంటనే నా పొరపాటు గుర్తించి  డిలీట్ చేశాను.

also read: Irumudi: రవితేజ ఇరుముడిలో కొత్త హీరోయిన్.. గోల్డెన్ లెగ్ తన సొంతం 

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)గారిపై నాకు అపారమైన గౌరవం ఉంది. 'వారణాసి'(Varanasi)సినిమాతో ఆయన పేరుతో ఇంకా ఎన్నో రికార్డులు నమోదవుతాయని నేను ఎప్పుడూ నమ్ముతుంటాను. ఆయన్ని గానీ, అభిమానులని గానీ బాధపెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘పోకిరి’ గురించి నేను చేసిన ట్వీట్లు చూస్తే ఆయనపై నాకు ఉన్న ప్రేమ, గౌరవం అర్థమవుతుంది. నా తప్పు వల్ల ఎవరికైనా మనస్తాపం కలిగితే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. ఒక సినిమా రికార్డులు సృష్టించాలంటే అన్ని హీరోల అభిమానులు, కుటుంబాల మద్దతు అవసరం. ఉస్తాద్ రిలీజ్ కి కేవలం 10 రోజులు మాత్రమే ఉండగా అలాంటి పోస్టులు చేసేంత అవగాహన లేకుండా అయితే నేను లేను. మా సినిమాకి   మీ మద్దతు కొనసాగించాలని కోరుకుంటున్నానని సదరు నోట్ లో  తెలియచేసాడు.

 

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.