Home  »  News  »  డబ్బింగ్ షురూ చేసిన పవర్‌స్టార్.. ఉగాది సంబరాలకు పవన్ ఫ్యాన్స్ రెడీ!

Updated : Mar 7, 2026

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 19న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా స్పీడ్‌గా జరుగుతోంది. అందులో భాగంగా పవన్‌కళ్యాణ్ తన వెర్షన్ డబ్బింగ్‌ను ప్రారంభించారు. దీనికి సంబంధించి అధికారికంగా పెట్టిన పోస్ట్ ఇప్ప్పుడు వైరల్‌గా మారుతోంది. డబ్బింగ్ చెప్తున్న పవన్‌కళ్యాణ్ పక్కన దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకుడు థమన్ ఉన్నారు. 

శరవేగంగా జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని హరీష్ శంకర్ పర్యవేక్షిస్తున్నారు. మరో పక్క థమన్ మరోసారి ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ పవర్‌ఫుల్ స్కోర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఒక సర్‌ప్రైజ్‌ను ఈరోజు రివీల్ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏది ఏమైనా ఎంతోకాలంగా పవర్‌స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ ఉగాదికి థియేటర్లలో కలెక్షన్ల సునామీ సష్టించేందుకు సిద్ధమవుతోంది. 

ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చిత్రాన్ని నిర్మిస్తోంది. పవన్‌కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్‌’ ఎలాంటి సంచలనాలు సష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్ప్పుడు ఆ చిత్రాన్ని మించే స్థాయిలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ ఉందనే ప్రచారం జరుగుతోంది. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.