![]() |
![]() |
కంటెంట్ కింగ్ శ్రీ విష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ పెయిర్‌గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ఈ చిత్రంతో మరోసారి అలరించనున్నారు. మార్చి 6న ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈక్రమంలో గురువారం నాడు మీడియాకి ప్రత్యేకంగా చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన ప్రీమియర్ షో ప్రెస్ మీట్‌లో..
శ్రీ విష్ణు మాట్లాడుతూ .. ‘‘‘మృత్యుంజయ్’ ప్రీమియర్ షోకి వచ్చిన వారందరికీ థాంక్స్. థియేటర్లో రెస్పాన్స్ చూశాను. అందరూ చాలా ఎంజాయ్ చేశారు. రాజమౌళి గారి నుంచి మా సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయింది. తారక్ గారు ట్రైలర్ రిలీజ్ చేశారు. నాని గారు రాత్రి మూవీని చూసి మెచ్చుకున్నారు. కంటెంట్ మూవీస్ ఎప్పుడు వచ్చినా మీడియా, ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. కంటెంట్ సినిమాకి అందరూ వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నిర్మాత సందీప్ గుణ్ణం మాట్లాడుతూ .. ‘‘మృత్యుంజయ్’ని సపోర్ట్ చేసిన సుకుమార్ గారు, రాజమౌళి గారు, తారక్ గారు, నాని గారు ఇలా అందరికీ థాంక్స్. ఈ మూవీ కోసం మా టీం నిద్రలేని రాత్రులు గడిపి పని చేసింది. ఈ చిత్రంలో శ్రీ విష్ణు చాలా కొత్తగా కనిపిస్తారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
హుస్సేన్ షా కిరణ్ మాట్లాడుతూ .. ‘నాని గారు ‘మృత్యుంజయ్’ మూవీని చూశారు. ఆయనకు నచ్చింది అని నాకు తెలిసిన తరువాత నాకెంతో ప్రశాంతంగా అనిపించింది. ఆయన రివ్యూ ఎప్పుడూ తప్పదు. నా ఈ ప్రయాణంలో సపోర్ట్‌గా నిలిచిన ఎన్టీఆర్ గారికి థాంక్స్. శ్రీ విష్ణు గారు ఈ చిత్రంలో రిపోర్టర్‌గా నటించారు. ఈ సినిమాలో ఆయన నటన చాలా కొత్తగా ఉంటుంది. రెబా మోనికా పోలీస్ ఆఫీసర్‌గా అద్భుతంగా నటించారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
రెబా మోనికా జాన్ మాట్లాడుతూ .. ‘‘మృత్యుంజయ్’ సినిమాని సపోర్ట్ చేస్తున్న మీడియాకి థాంక్స్. మా సినిమా పట్ల మేం ఎంతో గర్వంగా ఉన్నాం. మా చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. మళ్లీ మళ్లీ ఈ టీంతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
మనీషా ఎ. దత్ మాట్లాడుతూ .. ‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. శ్రీ విష్ణు గారితో ఇది నాకు రెండో సినిమా. ఈ మూవీకి మేం, మా టీం చాలా కష్టపడి పని చేశాం. మా అన్నయ్య హుస్సేన్ షా వల్లే ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆయనకు ఎంతో టాలెంట్, సహనం ఉంది. ‘మృత్యుంజయ్’ చాలా కొత్తగా ఉంటుంది. అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
రమ్య మాట్లాడుతూ .. ‘‘మృత్యుంజయ్’ చాలా డిఫరెంట్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
నటుడు సుదర్శన్ మాట్లాడుతూ .. ‘‘మృత్యుంజయ్’ అందరినీ సంతృప్తి పరిచేలా ఉంటుంది. కంటెంట్‌తో శ్రీ విష్ణు ఈ సారి కూడా అందరినీ ఆకట్టుకుంటాడు. నాకు ఈ ప్రయాణంలో సపోర్ట్‌గా నిలిచిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
నటుడు అయ్యప్ప శర్మ మాట్లాడుతూ .. ‘నాకు గుణ్ణం గంగరాజు గారంటే ఎంతో ఇష్టం. సందీప్ గుణ్ణం ఇలా సినిమాని నిర్మించడం ఆనందంగా ఉంది. హుస్సేన్ చెప్పిన ఈ కథ నాకెంతో నచ్చింది. శ్రీ విష్ణు తెర ముందు, తెర వెనుక ఒకేలా, ఎంతో సరదాగా ఉంటాడు. ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
నటుడు రచ్చ రవి మాట్లాడుతూ .. ‘‘మృత్యుంజయ్’ విషయంలో నిర్మాతలు సందీప్ గుణ్ణం, వినయ్ గారు ఎంతో సహరించారు. సెటిల్డ్ పాత్ర అని దర్శకుడు ముందే చెప్పారు. శ్రీ విష్ణు అన్ని రకాల పాత్రల్ని అవలీలగా పోషించగలరు. ఆయన ఎప్పుడూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. గుండెని తాకే ఎమోషన్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు. అందరూ ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.
![]() |
![]() |