Home  »  News  »  వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ స్టోరీ ఇదే.. ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్ మామూలుగా ఉండదు!

Updated : Feb 27, 2026

  • దగ్గుబాటి, నందమూరి మల్టీస్టారర్
  • అదిరిపోయే స్టోరీతో అనిల్ రావిపూడి 
  • వచ్చే సంక్రాంతికి డబుల్ ట్రీట్

2025 సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం', 2026 సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్‌ గారు'తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ని అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. 2027 సంక్రాంతికి హ్యాట్రిక్ కి సిద్ధమవుతున్నాడు. (Anil Ravipudi)

అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ మల్టీస్టారర్ కావడం విశేషం. ఇందులో వెంకటేష్(Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటిస్తున్నారు. "మొదటి వందకోట్ల బొమ్మ కొట్టిన హీరో వెంకటేష్ గారితో, మొదటిసారి బొమ్మ తీసే అవకాశం ఇచ్చిన హీరో కళ్యాణ్ రామ్ గారితో కలిసి.. 2027 మొదటి పండగకి మీ ముందుకు వస్తున్నాం." అంటూ తాజాగా రావిపూడి తన కొత్త సినిమాని ప్రకటించాడు.

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'పటాస్'తోనే అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత వీరి కలయికలో సినిమా రాలేదు. మరోవైపు వెంకటేష్ తో 'ఎఫ్-2', 'ఎఫ్-3', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు చేశాడు. అలాంటిది ఇప్పుడు ఆ ఇద్దరితో కలిసి సినిమా చేస్తున్నట్టు అనిల్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

నిజానికి వెంకటేష్, కార్తీతో అనిల్ రావిపూడి మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. అలాంటిది అనూహ్యంగా కళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్ట్ లోకి రావడం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇక ఈ సినిమా స్టోరీ గురించి కూడా ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. ఇందులో 'బావ-బావమరిది' మధ్య సాగే ఆసక్తికరమైన ప్రయాణాన్ని చూడబోతున్నమాట. బావ-బావమరిది మధ్య ఉండే సరదా కాన్ఫ్లిక్ట్‌లను చాలా ఎంటర్టైనింగ్‌గా చూపించబోతున్నారట. బావగా వెంకటేష్, బావమరిదిగా కళ్యాణ్ రామ్.. వచ్చే సంక్రాంతికి వినోదాల విందుని అందించడం ఖాయమని తెలుస్తోంది.

Also Read: అన్‌ప్లగ్‌డ్‌ వెడ్డింగ్ అంటే ఏంటి? విజయ్-రష్మిక ఎందుకలా చేశారు?

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.