Home

»

Latest News

షాక్ అవ్వకండి.. మన శంకర వరప్రసాద్ గారు ఓటిటి రెస్పాన్స్ ఇదే

Feb 13, 2026 2:59PM

 


-ఓటిటి లో మన శంకర వరప్రసాద్ గారు సంచలనం 
-రికార్డు స్థాయి ఎంత 
-ముందు ముందు పరిస్థితి ఏంటి


మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)తో మెగాస్టార్ తన జోరుని ఏ మాత్రం తగ్గించడం లేదు. బహుశా సోదరుడు వెంకీ ఉన్నాడనేమో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతు సరికొత్త రికార్డులని సృష్టిస్తున్నాడు.ఆల్రెడీ మాకు తెలుసు కదా! 400 కోట్ల క్లబ్ లోకి కూడా చేరబోతోంది. కొత్త వార్త ఏమైనా చెప్తాడా అని అనుకుంటున్నారా ! మీరు ఊహించినట్టుగానే కొత్త న్యూస్.. కావాలంటే మీరే చదవండి.


 ఫిబ్రవరి 11 నుంచి  జీ 5(Zee5)వేదికగా మన శంకర వరప్రసాద్ గారు ఓటిటిలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇలా అడుగుపెట్టిందో లేదో కేవలం 24 గంటల్లోనే  200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి ఓటిటి ప్లాట్ ఫామ్ కి సంబంధించి నవ చరిత్ర ని సృష్టించింది. ఒక తెలుగు సినిమాకి ఓటిటిలో ఆ స్థాయిలో ఆదరణ దక్కడం చాలా అరుదు. దీన్నిబట్టి  మన శంకర వరప్రసాద్ పై ఉన్న సినీ మోజు ఏ స్థాయిలో ఉందో   మరోసారి అర్ధమయ్యింది. సర్వర్లు షేక్ అవుతున్నాయనే టాక్ కూడా చాలా బలంగానే అభిమానం అనే సెక్యూరిటీ తో చక్కర్లు కొడుతుంది. మరి ముందు ముందు ఓటిటి లో ఎన్ని రికార్డులు అందుకుంటుందో చూడాలి.

 

Also read:  ఫంకీ మూవీ రివ్యూ 
 
దీన్ని బట్టి మనకి అర్ధమవుతుంది ఏంటంటే మన శంకర వరప్రసాద్ గారుని చిరంజీవి(chiranjeevi),వెంకటేష్(venkatesh),నయనతర(Nayanthara),అనిల్ రావిపూడి(Anil Ravipudi)వాళ్ళ సినీ కెరీర్ కోసం స్టార్ట్ చేయలేదు.అభిమానులు, ప్రేక్షకుల కోసం స్టార్ట్ చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టిల్ ఇంకా థియేటర్స్ లో రన్ ఆవుతూనే ఉంది. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com