Home  »  News  »  ఫంకీ మూవీ రివ్యూ 

Updated : Feb 13, 2026

 


 సినిమా పేరు: ఫంకీ
న‌టీన‌టులు:  విశ్వక్ సేన్, కయాదు లోహర్, సంపత్, ఈశ్వరి రావు, దిల్ రాజు, హరీష్ శంకర్, అనుదీప్, కళ్యాణ్ శంకర్ తదితరులు   
సినిమాటోగ్ర‌ఫీ: సురేష్ సారంగం
ఎడిట‌ర్‌: నవీన్ నూలి
మ్యూజిక్: భీమ్స్ 
నిర్మాత‌లు: నాగవంశీ, సౌజన్య 
బ్యానర్స్: సితార ఎంటర్ టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్ 
రచన, ద‌ర్శ‌క‌త్వం: అనుదీప్
రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 13  2026

 

వరుస పరాజయాల నుంచి విముక్తి కోసం ఎదురు చూస్తున్న 'విశ్వక్ సేన్'(Vishwak Sen)ఈ రోజు ఫ్యామిలీ ఎంటర్టెనర్ 'ఫంకీ'(Funky)తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యాడు.జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్, డ్రాగన్ బ్యూటీ కయదు లోహర్(kayadu Lohar)నిర్మాత నాగవంశీ(Naga Vamsi)లు ఫంకీ కి స్పెషల్ ఎట్రాక్షన్. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.


కథ

కోమల్ (విశ్వక్ సేన్) ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకొని డిఫరెంట్ మెంటాలిటీతో  కూడిన వ్యక్తి. ఎప్పుడూ ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. అలా అని చెడ్డ వ్యక్తి ఏం కాదు.. పెద్ద సినిమా డైరెక్టర్ అవ్వాలనేది తన గోల్.ఈ క్రమంలో మంచి ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో అవకాశం వస్తుంది. నాలుగు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలనేది కండిషన్. సదరు మంచి ప్రొడక్షన్ అధినేత సుదర్శన్ (నరేష్) కూతురుచిత్ర (కయదు లోహర్) కి కోమల్ పై నమ్మకం లేకపోవడంతో తనే సినిమా పనులు దగ్గరుండి చూసుకుంటుంది. చిత్రకి కోమల్ పై నమ్మకం ఎందుకు లేదు? సినిమా పూర్తయిందా లేదా? ఆ ప్రయాణంలో కోమల్, చిత్ర తో పాటు మిగతా క్యారెక్టర్స్ మధ్య ఏం జరిగిందనేదే ఫంకీ.

 

ఎనాలసిస్ 

పైన చెప్పుకున్నట్టుగానే పెద్దగా కథ లేదు. ఒక సినిమాని తెరకెక్కించాలనే సింగల్ పాయింట్ తో కథ,కథనం నడవడంతో పాటు పంచ్ డైలాగ్స్ కోసం సినిమా తెరకెక్కించినట్టుగా అనిపిస్తుంది. ఆ విషయంలో మేకర్స్ ఒక మాదిరిగా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.ఫస్ట్  హాఫ్ లో కోమల్,చిత్ర ఎంట్రీ సీన్స్ బాగున్నాయి. మూవీ  మొత్తం ఆ ఇద్దరి మధ్యే ఎక్కువ నడవడంతో చూసిన సీన్స్ మళ్ళీ చూస్తున్నట్టుగా ఉంది. కాకపోతే కోమల్, చిత్ర  కెమిస్ట్రీతో పాటు డైలాగ్స్ బాగున్నాయి. కేవలం డైలాగ్స్ నే నమ్ముకోకుండా చిత్ర కి సినిమా కథ చెప్పి డైరెక్షన్ అవకాశం సంపాదించడానికి  కోమల్ ప్రయత్నించడం చూపించాల్సింది.

 

ఈ క్రమంలో ఇద్దరి మధ్య కోపాలు, ప్రేమ లాంటిది ఎస్టాబ్లిష్ చేస్తే కొత్త లుక్ వచ్చి ఉండేది. జికే క్యారక్టర్ ద్వారా సీరియస్ అండ్ కామెడీ    బాగా ఎస్టాబ్లిష్ అవ్వడంతో నవ్వులు పూయించింది. కోమల్ ఫ్యామిలీ సీన్స్ కూడా ఒకే. ఇంటర్వెల్ ట్విస్ట్ పెద్దగా పేలలేదు.సెకండ్  హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే కొంచం వేగంగా నడవడంతో పాటు కొత్త సీన్స్ వచ్చాయి.ముఖ్యంగా కోమల్ సిస్టర్ కి సంబంధించిన పెళ్లి చూపుల సీన్స్, పెళ్లి సీన్స్ హైలెట్. కోమల్ ఫ్రెండ్స్ గా చేసిన డైరెక్టర్స్  అనుదీప్, కళ్యాణ్ శంకర్ సీన్స్ రొటీన్ గానే ఉన్నాయి. దర్శకుడిగా కోమల్ సినిమా కంప్లీట్ చేసే సీన్స్ ని ఎక్కువగా చూపించాల్సింది. ప్రీ క్లైమాక్స్,క్లైమాక్స్ బాగున్నాయి.

 

నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు 


కోమల్ గా విశ్వక్ సేన్ పెర్ ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉంది. తన కోసమే ఆ క్యారక్టర్ క్రియేట్ అయ్యిందా అనేలా మెస్మరైజ్ చేసాడు. కొత్త రకం బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. చిత్ర గా కయదు లోహర్ తన కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన అన్ని చిత్రాల్లో ఫంకీ నే ది బెస్ట్. అంతలా తన క్యూట్ ఎక్సప్రెషన్స్ తో మెజారిటీ మార్కులు పొందింది. జికే గా సంపత్ మరోసారి ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన విలనిజాన్ని పర్ఫెక్ట్ గా ప్రదర్శించాడు. మిగతా క్యారెక్టర్స్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. దిల్ రాజు, హరీష్ శంకర్ గెస్ట్ అప్పీరియన్సులా వచ్చి ఫ్రెష్ నెస్ తీసుకొచ్చారు. అనుదీప్ మరో సారి తన  డైలాగ్స్, కామెడీ పంచులుతో మెస్మరైజ్ చేసాడు. దర్శకుడిగా మాత్రం మెరుపులు చూపించలేకపోయాడు.నిర్మాణ విలువలు బాగున్నాయి. సురేష్ సారంగం ఫొటోగ్రఫీ ఎక్స్ లెంట్. ప్రతి ఫ్రేమ్ లో రిచ్ నెస్ ని తీసుకురావడంలో భారీగానే సక్సెస్ అయ్యాడు. భీమ్స్  ఆర్ ఆర్ పరంగా మెప్పించినా క్యాచీ సాంగ్స్ మాత్రం ఇవ్వలేకపోయాడు.
 
  
చివరిగా చెప్పాలంటే విశ్వక్ సేన్, కయదు లోహర్ ల స్క్రీన్ ప్రెజెన్స్ బాగుండటంతో   పాటు  అనుదీప్ గత చిత్రాల స్టయిల్లోనే  ఉంది. జాతిరత్నాలు పాట్రన్ ఇష్టపడే వాళ్ళకి నచ్చవచ్చు. రెగ్యులర్ సినిమా ఊహిస్తే మాత్రం భంగపాటుకి గురవుతారు. 

 

 

బలాలు

1 .విశ్వక్ సేన్, కయదు లోహర్ పెర్ ఫార్మెన్స్, 
2 . కామెడీ డైలాగ్స్, 
3 . ఫొటోగ్రఫీ 
4 .ప్రొడక్షన్ వాల్యూస్ 
5 .క్లైమాక్స్ 

 

బలహీనతలు 

1 . ఒకే పాయింట్ పై నడిచే కథ  
 2 . గ్రిప్ లేని స్క్రీన్ ప్లే
3 . ప్రధాన క్యారెక్టర్స్ ని సరిగా ఉపయోగించుకోకపోవడం 
4 . లాజిక్ లేని కొన్ని సీన్స్ 

 

రేటింగ్ 2 .5 / 5
                                                                                                                    అరుణాచలం 

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.