![]() |
![]() |

ఇటీవల కాలంలో హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా మెజారిటీ సినిమాలు మూడు, నాలుగు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడదే బాటలో 'నారీ నారీ నడుమ మురారి' పయనిస్తోంది. (Nari Nari Naduma Murari)
2026 సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాలలో 'నారీ నారీ నడుమ మురారి' ఒకటి. శర్వానంద్ హీరోగా 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్.. జనవరి 14 సాయంత్రం థియేటర్లలో అడుగుపెట్టింది. థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ చిత్రం.. మంచి వసూళ్లతో సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ పలు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అలాంటిది సడెన్ గా ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు.

'నారీ నారీ నడుమ మురారి' ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. అంటే థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఒక సూపర్ హిట్ మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండగానే ఓటీటీలో అడుగుపెడుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.
Also Read: 'ఓం శాంతి శాంతి శాంతిః' మూవీ రివ్యూ
![]() |
![]() |