![]() |
![]() |

ఈ సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి కిషోర్ తిరుమల దర్శకుడు. భార్య, ప్రేయసి మధ్య నలిగిపోయే వ్యక్తిగా రవితేజ కనిపిస్తున్నాడు. (Bhartha Mahasayulaku Wignyapthi)
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. తాజాగా థర్డ్ సింగిల్ గా 'వామ్మో వాయ్యో' సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్స్ లో ఇద్దరు హీరోయిన్స్ కలిసి రవితేజ చిందేయడం విశేషం. (Vaammo Vaayyo Song)
భీమ్స్ సిసిరోలియో శైలిలో ఫోక్ టచ్ తో ఉన్న మాస్ సాంగ్ ఇది. అందరూ వైబ్ అయ్యేలా ఎనర్జిటిక్ గా సాంగ్ ఉంది. "ఇల్లు పాయె ఒళ్ళు పాయె ఓ రామ రామ.. గ లచ్చుగాని ఎచ్చులు పాయె ఓ రామ రామ" అంటూ పాట సాగింది. భీమ్స్ బీట్ కి తగ్గట్టుగానే దేవ్ పవర్ లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. సింగర్ స్వాతి రెడ్డి కూడా ఎంతో ఎనర్జిటిక్ గా సాంగ్ ని ఆలపించింది. ఇక లిరికల్ వీడియోలో ఎనర్జీ విషయంలో రవితేజతో పోటీపడ్డారు హీరోయిన్స్.
మొత్తానికి 'వామ్మో వాయ్యో' సాంగ్ ఇన్ స్టాంట్ చార్ట్ బస్టర్ అని చెప్పవచ్చు. ఈ సాంగ్ తో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాకి బోలెడంత ప్రమోషన్ జరిగే అవకాశముంది.
![]() |
![]() |