![]() |
![]() |

సినిమా పేరు: గత వైభవం
నటీనటులు: ఆషిక రంగనాథ్ ,దుశ్యంత్, కిషెన్ బిలగాలి, కృష్ణ హెబ్బాలే, సుధా బెల్వాడి తదితరులు
సినిమాటోగ్రఫీ: విలియం డేవిడ్
ఎడిటర్: అషిక్ కులిగొలి
సంగీతం: జుదా శాండీ
నిర్మాత: దీపక్ తిమ్మప్ప, సుని
రచన, దర్శకత్వం: సుని
రిలీజ్ డేట్ : జనవరి 1 ,2025
కింగ్ నాగార్జున హిట్ మూవీస్ లో ఒకటైన 'నా సామి రంగ' తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న భామ 'ఆషిక రంగనాథ్'(Ashika Ranganath). చిరంజీవి అప్ కమింగ్ మూవీ విశ్వంభర లో కూడా వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేస్తుంది. రవితేజ తో చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి తో అయితే ఈ సంక్రాంతికి సందడి చేయనుంది. దీంతో తెలుగు ప్రేక్షకులు ఆషిక రంగనాథ్ సినిమాలపై ఒక కన్నేసి ఉంచుతున్నారు. ఈ క్రమంలోనే నూతన హీరో దుష్యంత్(Ss Dushyanth)తో కలిసి 'గత వైభవం' అనే మూవీతో ఈ రోజు సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యింది. ప్రీమియర్స్ కూడా ప్రదర్శించగా మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
ఆధునిక( ఆషిక రంగనాథ్) ఆర్టికల్చర్ స్టూడెంట్ తో పాటు అందమైన పెయింటింగ్ లని వేయడంలో నైపుణ్యురాలు. ఈ క్రమంలో పురాతన్(దుశ్యంత్) బొమ్మ వేసి సోషల్ మీడియాలో ఉంచుతుంది. పురాతన్ ఫ్రెండ్ ఆ బొమ్మ చూసి పురాతన్ కి చెప్తాడు. గ్రాఫిక్స్ కి సంబంధించిన స్టూడియో నడిపే పురాతన్ ఒక జల్సా రాయుడు. తప్పుడు ఉద్దేశ్యంతోనే తనకి ఒక ఫిగర్ ఈజీగా పడిపోయిందని ఆధునిక కోసం వెళ్తాడు. కానీ పురాతన్ కి సంబంధించిన రెండు జన్మరహస్యాలని ఆధునిక చెప్తుంది. పురాతన్ కే ఎందుకు జన్మ రహస్యాలని చెప్పింది? ఆ జన్మ రహస్యాల్లో జరిగిన కథ ఏంటి? అవి నిజమేనా? నిజమే అయితే వాటిల్లో ఆధునిక క్యారక్టర్ ఏంటి? ఆ జన్మల్లో ఆధునిక, పురాతన్ ప్రేమించుకున్నారా? ప్రేమించుకుంటే వాళ్ళ ప్రేమ ఫలించిందా? లేదా? మరి ఈ జన్మ పరిస్థితి ఏంటి? ఈ మొత్తం కథ కి పురాతన్ తండ్రైన ప్రముఖ సైక్రియాటిస్ట్, పుస్తక రచయిత అయిన కృష్ణ కనాటి కి ఏమైనా సంబంధం ఉందా? ఈ విధంగా పలు కోణాలు మిళితమై ఉన్నదే గత వైభవం చిత్ర కథ.
ఎనాలసిస్
ప్రేక్షకులని మెస్మరైజ్ చెయ్యడానికి గత వైభవం లాంటి లైన్ కంటే మంచి కథ దొరకదేమో. అంతలా చిత్రం యొక్క పాయింట్ బాగుంటుంది. వందల ఏళ్ళకి పూర్వం ఒకరి ముఖాలు ఒకరికొకరు చూసుకోకుండానే కాగితాలలోని కబుర్లు ద్వారా ప్రాణానికి ప్రాణంగా యువతి యువకులు ప్రేమించుకుంటారు. ఆ తర్వాత ఆ ఇద్దరే భార్యా భర్తలు అవుతారు. కానీ తాము ప్రేమించిన వాళ్ళని తలుచుకుంటు శారీరకంగా ఒకటి కారు. ఆ తర్వాత అసలు నిజం ఇద్దరకీ తెలుస్తుంది. కానీ విధి వాళ్ళని శాశ్వతంగా దూరం చేస్తుంది. ఈ ఒక్క పాయింట్ చాలు ఈ కథ ఎంత గొప్పదో చెప్పుకోవడానికి. పైగా ఆ రోజుల్లో బాగా ప్రాచుర్యం లో ఉన్న దున్నపోతుల పోటీ పందలైన 'కంబళీ' బ్యాక్ గ్రౌండ్.
దీంతో ఎంతో అద్భుతమైన సినిమాగా తెరకెక్కించవచ్చు. కానీ స్క్రీన్ ప్లే తెలియకపోవడం వల్లే 'గత వైభవం' మరుగున పడిపోయింది.సినిమా చూసీ బయటకొచ్చాక అంత ఖర్చు పెట్టి ఇలా తెరకెక్కించారనే జాలి కూడా మేకర్స్ పై కలుగుతుంది. అర్ధం పర్థం లేని సన్నివేశాలతో, క్యారెక్టర్స్ యొక్క డిజైన్స్ తో, డైలాగ్స్ తో, స్క్రీన్ ప్లే తో ఒక రకమైన గందర గోళం నడిచింది. నడిచింది అనే కంటే వాళ్లే చేజేతులారా చేసుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రాపర్ స్క్రిప్ట్ పూర్తయ్యాకే షూట్ కి వెళతారు కాబట్టి. ఫస్ట్ హాఫ్ ప్రారంభమే పురాతన్ బొమ్మని ఆధునిక వేయడంతో ప్రారంభమయ్యింది.
ఆ విషయం తెలిసి పురాతన్ ఆ అమ్మయి తనని ఇష్టపడుతుందనీ, శారీరకంగా కలవడానికి వెంటనే వెళ్లడం అనేది వర్క్ అవుట్ కాలేదు. అతను అలా వెళ్ళడానికి టైం గ్యాప్ ఇవ్వాల్సింది. ఈ కథలో పురాతన్ తండ్రి సైక్రియాటిస్ట్ కృష్ణ ఇచ్చే ట్విస్ట్ కీలకం కాబట్టి ఆ గ్యాప్ లో ఒక పేషేంట్ కి సంబంధించిన మెంటల్ కండిషన్ ని రీసర్చ్ చేస్తున్నట్టుగా సీన్స్ ఎస్టాబ్లిష్ చెయ్యాల్సింది. మొదటి జన్మలో వచ్చిన దేవతల కాలం నాటి సీన్స్ , పోర్చుగల్ కాలం నాటి ఎట్మాస్పియర్ బాగున్నా సీన్స్ మాత్రం బాగోలేదు. పైగా అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి.
వాటిల్లోని ఆధునిక, పురాతన్ ల పెర్ ఫార్మెన్స్ మాత్రం బాగున్నాయి. ఇంటర్ వెల్ లో ఎలాంటి హడావిడి లేకపోవడమే కాకుండా త్వరగా వచ్చినట్టుగా ఉంది. ఇక సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే పర్వాలేదనే స్థాయిలోనే ఉంటుందని ఒక అంచనాకి వస్తాం. ఎందుకంటే వంద ఏళ్ళ కాలం నాటి పురాతన గ్రామాలకి చెందిన విజువల్స్, దున్నపోతులతో ఆడే ప్రాచీన గ్రామీణ క్రీడ కంబళి, అందమైన ప్రేమ ఉంటాయి. కానీ సన్నివేశాలన్నీ నిరుత్సాహ పరుస్తాయి.
మంగళ, చెన్నయ్య లు ప్రేమించుకున్న వాళ్ళమే భార్య భర్తలం అయ్యాం అని తెలుసుకునే సన్నివేశం మాత్రం సూపర్ గా ఉంటుంది. ఒకటవుదామని అనుకునే లోపే చెన్నయ్య మరణించడం కంట తడి పెట్టిస్తుంది. మంగళ, చెన్నయ్య మధ్య వచ్చే కాగితపు ప్రేమ సీన్స్, పోస్ట్ మెన్ గా పని చేసిన పాలవాడి సీన్స్ బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో పురాతన్ తండ్రి అయిన సైక్రియాటిస్ట్ కృష్ణ ద్వారా అనవసర గందరగోళాన్ని సృష్టించారు.
నటీ నటులు, సాంకేతిక నిపుణుల పనితీరు
ఆధునిక, మంగళ, దేవ లోకానికి చెందిన దేవ కన్యగా, మానసిక రుగ్మతతో బాధపడే పేషంట్ గా ఆషిక రంగనాథ్ తన క్యారక్టర్ కి నూటికి నూరుపాళ్లు న్యాయం చేసింది. సినిమా అర్ధం పర్థం లేకుండా సాగుతున్నా తన పెర్ ఫార్మెన్స్ తో చివరి దాకా థియేటర్స్ లో కూర్చోబెట్టిందనడంలో నో డౌట్స్ . పురాతన్, రాక్షస జాతికి చెందిన రాక్షసుడిగా, చెన్నయ్య గా దుశ్యంత్ నటనలో పెద్దగా మెరుపులు లేవు. కాకపోతే చెన్నయ్యగా పరిణితి చెందిన పెర్ ఫార్మ్ ని ప్రదర్శించాడు. ఇక మిగతా నటుల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. పాలవాడుగా చేసిన ఆర్టిస్ట్ మాత్రం తన మేనరిజమ్స్ తో మెప్పించాడు. ఇక దర్శక, రచయిత సుని మాత్రం ఆ రెండు విభాగాల్లో దారుణంగా విఫలమయ్యాడు.ఎంతలా అంటే కనీసం ఏ సీన్ ని ఎంత వరకు ఉంచాలి, ఆ సీన్ యొక్క ఉద్దేశ్యం ఏంటనే అవగాహన కూడా లేకుండా పోయింది. సినిమా తెరకెక్కించడం నాకు ముఖ్యం అది ప్రేక్షకులకి నచ్చుతుందా లేదా నాకు అనవసరం అనే విధంగా స్పీడ్ గా చుట్టేశాడు. నటి నటుల నుంచి బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ని రాబట్టుకోవడంలో కూడా విఫలమయ్యాడు. నిర్మాణ విలువలు బాగుండటంతో పాటు ఫొటోగ్రఫీ ఒక రేంజ్ లో ఉంది. సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో మెరుపులు ఏం లేవు.
ఫైనల్ గా చెప్పాలంటే ఒక మంచి కథకి దర్శక రచయిత సుని(Simple Suni)అన్యాయం చేసాడు. బహుశా వెన్నుపోటు అంటే ఇదేనేమో.. ఆషికా రంగనాధ్ పెర్ ఫార్మెన్స్ మాత్రం హైలెట్.
రేటింగ్ 2 /5
అరుణా చలం
![]() |
![]() |