![]() |
![]() |

నేడు(డిసెంబర్ 28) ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ జరిగింది. చిన్న నిర్మాతలు అంతా మన ప్యానల్ గా, అగ్ర నిర్మాతల వర్గమంతా ప్రోగ్రెసివ్ ప్యానల్ గా బరిలోకి దిగారు. ఈ పోటీలో ప్రోగ్రెసివ్ ప్యానల్ విజయం సాధించింది. నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు(Suresh Babu) ఎన్నికయ్యారు.
ప్రతి రెండేళ్లకు ఒకసారి ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరుగుతాయి. ఇందులో నాలుగు సెక్టార్లు భాగమై ఉన్నాయి. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్ కలిపి మొత్తం మూడు వేలకు పైగా సభ్యులు ఉన్నారు. (Telugu Film Chamber of Commerce)
నేడు జరిగిన ఛాంబర్ ఎన్నికల్లో 43శాతం పోలింగ్ నమోదైంది. మెత్తం 3287 ఓట్లకు గాను 1421 ఓట్లు పోల్ అయ్యాయి.
ప్రొడ్యూసర్స్ సెక్టార్ లో ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి ఐదుగురు, మన ప్యానెల్ నుంచి ఏడుగురు గెలుపొందారు.
స్టూడియో సెక్టార్ లో మన ప్యానెల్ వారు ముగ్గురు, ప్రోగ్రెసివ్ వారు ఒక్కరు గెలిచారు.
ఎగ్జిబిటర్స్ సెక్టార్ లో 16 ఈసి మెంబర్స్ కు గానూ గెలిచిన వారిలో 14 మంది ప్రోగ్రెసివ్ ప్యానల్ వారు కాగా, ఇద్దరు మన ప్యానెల్ వారు.
డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో 12 ఈసి మెంబర్స్ కు గానూ.. ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 8 మంది, మన ప్యానెల్ నుంచి 3 మంది గెలుపొందారు. ఒకటి టై అయింది.
4 సెక్టార్ చైర్మన్, 44 ఈసి మెంబర్స్ లతో కలుపుకొని మొత్తం 48 ఓట్లకు గానూ.. ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు 31 ఓట్లు, మన ప్యానెల్ కు 17 ఓట్లు వచ్చాయి.
ఛాంబర్ అధ్యక్ష పదవితో పాటు ఉపాధ్యక్ష, సెక్రటరీ పదవులన్నీ ప్రోగ్రెసివ్ ప్యానెల్ పరిధిలోనే ఉండనున్నాయి.
![]() |
![]() |