![]() |
![]() |

-ఏంటి ఆ సలహా
-ప్రకాష్ రాజ్ ఏమంటున్నాడు
-శివాజీ ఏమంటున్నాడు
తెలుగు చిత్ర సీమలోనే కాదు ఎంటైర్ దక్షిణ భారతీయ చిత్ర సీమ మొత్తంపై విలక్షణ నటుడుగా ప్రకాష్ రాజ్ కి ఉన్న క్యాపబిలిటీ తెలిసిందే. సుదీర్ఘ కాలం నుంచి అలు పెరగని నట పోరాట యోధుడుగా తన సత్తా చాటుతూ వస్తున్నాడు. రీసెంట్ గా ఓజి తో మెరిసిన ప్రకాష్ రాజ్ పలు కొత్త ప్రాజెక్ట్స్ ని లైనప్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్టాల్లో డ్రెస్ సెన్స్ పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంలో శివాజీపై ప్రముఖ నటి,యాంకర్ అనసూయ ఫైర్ అయ్యింది.
ఇప్పుడు ఈ విషయంపై అనసూయ కి మద్దతుగా ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తు 'సంస్కారి అని పిలవబడే వారిని మొరుగుతునే ఉండనివ్వండి. అది వారి నీచమైన మనస్తత్వం. మీరు ఇంకా బలంగా నిలబడండి. మేము మీతో ఉన్నాం.' అంటూ ట్వీట్ చేసాడు.
Also Read: మహేష్ బాబు నెక్స్ట్ టార్గెట్ పై సినీ విశ్లేషకులు ఏమంటున్నారు!
ఇక శివాజీ రీసెంట్ గా తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతు ప్రకాష్ రాజ్ గారు నా గురించి చెప్పిన మాటలని వినలేదని చెప్పడం జరిగింది.ఆల్రెడీ ఇప్పటికే శివాజీ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే.
![]() |
![]() |