![]() |
![]() |

-ఆ టార్గెట్ ఎలా ఉండాలి
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
-వారణాసి పరిస్థితి ఏంటి!
సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ పేరు స్క్రీన్ పై కనపడితే చాలు వయసుతో తారతమ్యం లేకుండా అభిమానులతో పాటు ప్రేక్షకులు థియేటర్స్ లో చేసే సందడి ఒక రేంజ్ లో ఉంటుంది. అలాంటిది ఇప్పుడు రాజమౌళి తో చేస్తున్న పాన్ ఇండియా మూవీ వారణాసి తో ఆ సందడి వాతారణం ఏ స్థాయిలో ఏర్పడుతుందో చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు వారణాసి మహేష్ పై ఎన్నో బాధ్యతలని, సవాళ్ళని ఉంచుతుంది. ఈ మేరకు ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ విశ్లేషకుల అభిప్రాయం ఎలా ఉందో చూద్దాం.
సినీ విశ్లేషకులు మాట్లాడుతు రాజమౌళితో చేస్తున్న వారణాసి తో మహేష్ రేంజ్ గ్లోబల్ స్థాయిలో పెరుగుతుంది. దీంతో మహేష్ తన అప్ కమింగ్ మూవీస్ ని కూడా అదే స్థాయిలో తీసుకురావాల్సిందే. ఇది ఒక రకంగా కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే రాజమౌళి దర్శకతంలో వచ్చిన తర్వాత కంప్లీట్ గా హీరో ఇమేజ్ ప్రేక్షకుల దృష్టిలో హై స్టాండర్డ్ లో ఉంటుంది.అంటే మహేష్ నెక్స్ట్ చిత్రాలు తన క్యారక్టరయిజేషన్ తో పాటు ఎంచుకునే కథ, కథనాలు ఎవరి ఊహలకి అందని విధంగా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే డైరెక్టర్స్ ,టెక్నీషియన్స్ విషయంలో మహేష్ ప్రత్యేకమైన శ్రద్ద చూపించాల్సిందే. అంటే ఇప్పట్నుంచే తన నెక్స్ట్ మూవీ గురించి మహేష్ కసరత్తు ప్రారంభించాల్సిందే అని విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also read: మహిళా కమిషన్ ఎదుట హాజరైన శివాజీ.. ఏం జరగబోతుంది
ఇక వారణాసి విషయానికి వస్తే ప్రస్తుతం రెగ్యులర్ గా చిత్రీకరణని జరుపుకుంటుంది. . రాజమౌళి తో పాటు చిత్ర యూనిట్ మొత్తం వారణాసి ని ఇండియాలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ గా చరిత్రలో నిలబడిపోయేలా చేయాలనే పట్టుదలతో ఉన్నారు . బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అందించిన ఒక అద్భుతమైన కథతో వారణాసి తెరకెక్కుతుండగా, ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమార్ కథకి కీలకమైన పాత్రల్లో చేస్తు వారణాసి కి మరింత వన్నె తీసుకురానున్నారు. 2027 లో వరల్డ్ వైడ్ గా ల్యాండ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. కె ఎల్ నారాయణ నిర్మాత.
![]() |
![]() |