![]() |
![]() |

-ఇంతకీ ఏమని చెప్పింది
-పోస్ట్ వైరల్
-ఆమె అభిప్రాయం అదే
అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా అత్యంత పాశవికంగా దీపు చంద్ర దాస్ అనే వ్యక్తిని దారుణంగా చంపి చెట్టుకి కట్టివేసి తగలబెట్టడం జరిగింది. ఇందుకు సంబంధిచిన వీడియోలు ఇప్పుడు నెట్టింట కలకలం కలిగిస్తున్నాయి. ఈ సంఘటనపై కాజల్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తు హిందువులారా మేల్కోండి. మీ మౌనం మిమల్ని రక్షించదు అనే క్యాప్షన్ తో పాటు కన్నీళ్ల ఎమోజీ ని జోడించి ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అనే లెటర్స్ తో బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఘోర కలికి సంబంధించిన ఇమేజ్ ని కూడా షేర్ చేసింది. ఇప్పుడు కాజల్ చేసిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also read: మీకు, అతనికి ముప్పై ఏళ్ళ వయసు తేడా ఉంది.. అయితే తప్పేంటి
కాజల్ అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే రణబీర్, సాయిపల్లవి, యష్, నితీష్ తివారి, నమిత్ మల్హోత్రా ల ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ 'రామాయణ'లో మండోదరి అనే క్యారక్టర్ ని పోషిస్తుంది. మరికొన్ని కొత్త ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.

![]() |
![]() |