![]() |
![]() |

-రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి వేడుకలు మొదలు
-నాటు నాటు తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు
-హరిణ్యరెడ్డి, చాహల్ పిక్స్ వైరల్
ఆర్ఆర్ఆర్ లోని 'నాటునాటు' సాంగ్ తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ప్రైవేట్ ఆల్బమ్స్ తో కూడా తన సత్తా చాటే రాహుల్ గాత్రం నుంచి ఇప్పటి వరకు సుమారు వంద పాటల దాకా వచ్చి అభిమానులని, ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాయి. రాహుల్ కి హరిణ్య రెడ్డి తో తన స్వస్థలం హైదరాబాద్ లో ఈ నెల 27వ తేదీన వివాహం జరగనుంది. ఈ వివాహ వేడుకకి పలువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలు హాజరు కాబోతున్నారు. ఇక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా రీసెంట్ గా నిర్వహించిన సంగీత్ వేడుకలో హరిణ్యకు రాహుల్ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు.
హరిణ్యకి ప్రముఖ ఇండియన్ క్రికెటర్ 'యుజ్వేంద్ర చాహల్' కి వీరాభిమాని. దీంతో రాహుల్ తన సంగీత్ వేడుకకి చాహల్‌ని ఆహ్వానించాడు. దీంతో హరిణ్య ఆనందానికి అవధులు లేవు. ఈ మేరకు చాహల్‌తో కలిసి దిగిన ఫోటోలని హరిణ్య సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రాహుల్ కి థాంక్స్ చెప్పింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హరిణ్య కి రాహుల్ ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్ లు ఇస్తూ సంతోషపెడుతున్నాడు. నిశ్చితార్థ సమయంలో కూడా హరిణ్య కోసం ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also read: రామ్ చరణ్ రికార్డుని ప్రభాస్ అందుకోగలడా!.. ప్రస్తుతానికి చరణ్ టాప్
రాహుల్ సినీ కెరీర్ ని చూసుకుంటే ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిత్ర మండలి లో కత్తి అందుకో జానకి అనే సాంగ్ తో తనదైన స్టైల్లో అలరించాడు. నటుడుగాను అడపాదడపా సిల్వర్ స్క్రీన్ పై మెరుసుతున్న విషయం తెలిసిందే.
![]() |
![]() |