![]() |
![]() |
- పాప్ ప్రపంచంలో రారాజు
- ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు
- 40 ఏళ్ళ క్రితం యూత్ ఐకాన్‌గా జాక్సన్
తన పాటలతో, డాన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఏకైక వ్యక్తి మైఖేల్ జాక్సన్. కొందరు తమ పాటలతో పాపులర్ అయ్యారు. మరికొందరు తమ డాన్స్‌తో పాపులర్ అయ్యారు. కానీ, ఈ రెండింటినీ మిక్స్ చేసి కుర్రకారును ఉర్రూతలూగించిన ఘనత జాక్సన్‌కే దక్కింది. చీకటి వెలుగులు కలగలిసిన అతని జీవితాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నారనే వార్త రావడంతో అతని అభిమానులు ఆ బయోపిక్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు.
దాదాపు నలభై సంవత్సరాల క్రితం మైఖేల్ జాక్సన్ పాటలకు, డాన్సులకు యూత్ మైమరచిపోయేవారు. చిన్నతనం నుంచే పాప్ సింగర్‌గా మంచి పేరు తెచ్చుకున్న జాక్సన్‌కి ఉన్న ఫాలోయింగ్ మరో సింగర్‌కి లేదంటే అతిశయోక్తి కాదు. సింగర్‌గా, డాన్సర్‌గా, మ్యూజిషియన్‌గా ఎన్నో ఆల్బమ్స్‌ను రూపొందించారు. ఇప్పటికీ అతని పాటలకు ఆదరణ ఉంది. అలాంటి లెజండ్ బయోపిక్‌ని ఆంటోని ఫక్వా తెరకెక్కిస్తున్నారు. మైఖేల్ జాక్సన్‌గా జాఫర్ జాక్సన్ నటిస్తున్నారు. ‘మైఖేల్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2026 ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
![]() |
![]() |