![]() |
![]() |

- ప్రభాస్, ఘట్టమనేని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
- చిన్నప్పటి ప్రభాస్ గా దర్శన్
- ఫౌజీ పై భారీ అంచనాలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu).. ఈ ఇద్దరి పేర్లు పక్క పక్కన ఉంటేనే ఏదో తెలియని వైబ్రేషన్. మరి ఆ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే.. సిల్వర్ స్క్రీన్ కి రెస్ట్ అనేది ఉండదు. కలెక్షన్స్ ని లెక్కపెట్టడానికి ఏదైనా కొత్త టెక్నాలజీ ని కూడా కనిపెట్టాలేమో. ప్రస్తుతానికి ఈ ఇద్దరి కాంబోలో సినిమా తెరకెక్కకపోయినా రావాలని కోరుకుందాం. అసలు విషయంలోకి వస్తే ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ తో పాటు, హను రాఘవపూడి(Hanu Raghavapudi)దర్శకత్వంలో 'ఫౌజీ'(fauzi)చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ తో అంచనాలు ఏ రేంజ్ కి వెళ్ళాయో కూడా తెలియని పరిస్థితి.
ఇప్పుడు ఈ మూవీలో మహేష్ బాబు మేనల్లుడు నటించబోతున్నాడు. అవును ఇది నిజం. మహేష్ బాబు సోదరి ప్రియదర్శని చిన్న కొడుకు దర్శన్ 'ఫౌజీ' లో చేస్తున్నాడు. ప్రియదర్శని ఎవరో కాదు ప్రముఖ హీరో సుధీర్ బాబు భార్య. దర్శన్ ఈ ఇద్దరికి రెండవ సంతానం. 'ఫౌజీ' లో అలాంటి ఇలాంటి క్యారక్టర్ లో దర్శన్ కనపడటం లేదు. ప్రభాస్ చిన్నప్పటి క్యారెక్టర్ ని పోషించబోతున్నాడు. అంటే జూనియర్ ప్రభాస్ రోల్. ఇప్పటికే దర్శన్ లుక్ టెస్ట్ పూర్తైందని. అతడి యాక్టింగ్ చూసి మేకర్స్ సైతం ఫిదా అయ్యారని తెలుస్తోంది.
'ఫౌజీ' లో ప్రభాస్ ఆర్మీ అధికారిగా కనపడుతున్న విషయం తెలిసిందే. ఆర్మీ అధికారి అంటే సైన్యంలో అనేక డిజిగ్నేషన్స్ ని దాటుకొని రావాల్సిందే. ఈ క్రమంలో చిన్నవయసు నుంచే కఠినమైన కసరత్తులు చేయాల్సి వస్తుంది. వాటన్నిటిని సిల్వర్ స్క్రీన్ పై దర్శన్ ప్రదర్శించి తన సత్తా చాటడం జరగడం ఖాయం. దీంతో దర్శన్ సిల్వర్ స్క్రీన్ పై తొలి సినిమాతోనే ఘట్టమనేని అభిమానులనే కాకుండా ప్రభాస్ అభిమానులని కూడా అలరిస్తాడు.
Also read: ఎంగేజ్మెంట్ విషయంలో అనుకున్నదే జరిగింది.. వాళ్ళకి మాత్రం మైండ్ బ్లాంక్
ఇది ఫ్యూచర్ లో దర్శన్ కెరీర్ కి ఎంతలా ఉపయోగపడుతుందో చెప్పక్కర్లేదు. మావయ్య మహేష్ ప్రస్తుతం ssmb 29 తో బిజీగా ఉన్నాడు. నాన్న సుధీర్ బాబు(Sudheer Babu)తన కొత్త మూవీ జటాధర(Jatadhara)తో నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దర్శన్ అన్నయ్య చరిత్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. ఘట్టమనేని అభిమానులు చరిత్ ని జూనియర్ మహేష్ బాబు అని పిలవడం కూడా స్టార్ట్ చేసారు.

![]() |
![]() |