![]() |
![]() |
చేసింది మూడు సినిమాలే. అందులో వెంకటేష్ హీరోగా చేసిన చింతకాయల రవి అతనికి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత 2015లో జాదూగాడు అనే సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకోలేదు. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత ఓ వయొలెంట్ స్టోరీని ఎంపిక చేసుకొని లేడీ సెంట్రిక్ మూవీతో వస్తున్నాడు. అతనే డైరెక్టర్ యోగి. భీమ్లా నాయక్, బింబిసార, విరూపాక్ష వంటి యాక్షన్ మూవీస్‌లో తన గ్లామర్‌తో అందర్నీ ఆకట్టుకున్న సంయుక్త మీనన్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. సినిమా పేరు ‘ది బ్లాక్‌గోల్డ్’.
సంయుక్త, యోగి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ది బ్లాక్‌గోల్డ్’ ఫస్ట్ లుక్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేశారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండా నిర్మిస్తున్న ఈ సినిమాకు సింధు మాగంటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంయుక్త హీరోయిన్‌గానే కాకుండా స్వయంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం. ఫస్ట్ లుక్‌లోనే సినిమా ఏ జోనర్‌లో ఉండబోతోంది అనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. చుట్టూ శవాలు, ఒళ్లంతా రక్తంతో, రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్ మీద గన్ పట్టుకొని నిలబడిన సంయుక్త.. చాలా వయొలెంట్‌గా కనిపిస్తోంది.
తన ట్విట్టర్ పేజీలో ‘ది బ్లాక్ గోల్డ్’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని పోస్ట్ చేస్తూ.. ‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు. పండగ రోజున ‘ది బ్లాక్ గోల్డ్’ ఫస్ట్‌లుక్‌ని రివీల్ చేయడం సంతోషాన్ని కలిగిస్తోంది. నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా ఇది. యాక్షన్, ఎమోషన్స్, హార్ట్ టచ్చింగ్ సీన్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. అవన్నీ మీకు బాగా నచ్చుతాయి’ అని తెలిపింది.
![]() |
![]() |