Home  »  News  »  అఖండ 2 ,కాంతార చాప్టర్ 1 సరసన నిలబడుతుందా! 

Updated : Oct 11, 2025

ప్రస్తుతం పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'డెవోషనల్ కంటెంట్' ఉన్న సినిమాల సీజన్ నడుస్తుందని భావించవచ్చు. సదరు డెవోషనల్ పాయింట్ కి స్కిప్ట్ పక్కాగా కుదిరితే చాలు పాన్ ఇండియా ప్రేక్షకులు థియేటర్స్ కి పరుగులు తీస్తున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్  కలెక్షన్స్ ల సునామితో తడిసిముద్దవుతుంది. ఇందుకు సాక్ష్యం ప్రస్తుతం థియేటర్స్ లో సత్తా చాటుతున్న కాంతార చాప్టర్ 1 . థియేటర్స్ లో అడుగుపెట్టి పది రోజులు కూడా కాకుండానే 500 కోట్ల రూపాయలని రాబట్టి, డెవోషనల్ కంటెంట్ కి ఉన్న కెపాసిటీ ని మరో సారి చాటి చెప్పింది. ఆ జోనర్ లోనే వచ్చిన కార్తికేయ 2(Karthikeya 2), హనుమాన్(Hanuman)కాంతార(Kantara)మిరాయ్(Mirai)కి కూడా పాన్ ఇండియా ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. 

దీంతో ఇప్పుడు అందరి దృష్టి గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)అప్ కమింగ్ మూవీ 'అఖండ పార్ట్  2'(Akhanda 2)పై పడింది. ఈ చిత్ర ప్రధాన కంటెంట్ 'డెవోషనల్'. అఖండ ని మించి డెవోషనల్ కి చెందిన అంశాలు పార్ట్ 2 లో ఉండబోతున్నాయి. పూర్తి డెవోషనల్ చిత్రంగా తెరకెక్కనుందనే ప్రచారం కూడా జరుగుతుంది. మొదటి భాగంలో అఘోర పాత్ర వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అఘోర జీవితంలో సంభవించిన కథతోనో, లేక మొదటి భాగంలో అఘోర ఎంటర్ కాకముందు, ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నాడో తెలిపే కథ తోనో తెరకెక్కబోతుందనే ప్రచారం సినీ సర్కిల్స్ లో వినపడుతుంది. మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ద్వారా అయితే, అలాంటి మాటలకి బలాన్ని చేకూరుస్తున్నాయి. సదరు టీజర్ లో హిమాలయాల్లో బాలయ్య అఘోర గా శివ తాండవం చేసాడు. దీంతో మూవీ విజువల్ గా ఎంత గ్రాండ్ గా ఉండబోతుందో అర్ధమవుతుంది. బాలయ్య చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో సీజీ వర్క్‌లు, యాక్షన్ సీక్వెన్స్‌, దేవాలయ నేపథ్యం విషయాల్లో మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.  

దీంతో పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద డెవోషనల్ కంటెంట్ కి ఉన్నక్రేజ్ దృష్ట్యా కాంతార చాప్టర్ 1 స్థాయిలో అఖండ 2 హిట్ అయ్యే ఛాన్స్ ఉందనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వినపడుతుంది. పైగా బాలయ్య, బోయపాటి శ్రీను(Boyapati Srinu)కాంబోలో ఇప్పటి వరకు చెప్పిన సినిమాల లిస్ట్ చూసినా అలాంటి వాతావరణం గ్యారంటీ అని చెప్పవచ్చు. సింహ, లెజెండ్, అఖండ లు ఒకదాన్ని మించి ఒకటి సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు. బాలకృష్ణ రేంజ్ ని కూడా హిమాలయాల శిఖరాలకి చేర్చాయి. కాబట్టి కాంతార చాప్టర్ 1 సరసన  అఖండ 2 చేరుతుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. తమిళ, హిందీ ప్రేక్షకులు 'అఖండ'(Akhanda)ని ఆశీర్వదించిన విషయం తెలిసిందే.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.