![]() |
![]() |

వైవిధ్యమైన చిత్రాలకి పెట్టింది పేరు దర్శకుడు 'పూరిజగన్నాధ్'(Puri jagannadh). గత చిత్రం డబుల్ ఇస్మార్ట్ పరాజయం తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ప్రస్తుతం మక్కల్ సెల్వం 'విజయ్ సేతుపతి'(Vijay sethupathi)తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. విభిన్నమైన నటుడుగా విజయ్ సేతుపతికి పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న క్రేజ్ తెలిసిందే. అసలు ఈ కాంబోలో సినిమా వస్తుందని ఎవరు ఊహించలేదు దీంతో ఈ చిత్రం ఎలాంటి సబ్జెక్ట్ తో తెరకెక్కబోతుందనే ఆసక్తి అభిమానులతో పాన్ ఇండియా మూవీ లవర్స్ లో ఉంది.
ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా హర్ష వర్ధన్ రామేశ్వర్(Harshavardhan Rameshwar)ఖరారయ్యాడు. పూరి జగన్నాధ్ ఈ విషయాన్నీ అధికారకంగా ప్రకటించాడు. ఈ మేరకు ఛార్మి, హర్షవర్ధన్ తో కలిసి పూరి దిగిన ఫోటో వైరల్ గా మారింది. కథకి తగ్గ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందించి, అందులోని సన్నివేశాలు ప్రేక్షకుల మనసుల్లోకి మరింత చొచ్చుకొని పోయేలా చెయ్యడం హర్షవర్ధన్ స్పెషాలిటీ. ఇందుకు సందీప్ రెడ్డి వంగ, రణబీర్ ల 'యానిమల్' నే ఉదాహరణ. ఆ చిత్ర విజయంలో హర్ష వర్ధన్ మ్యూజిక్ కూడా ఒక భాగంగా నిలిచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ చిత్రానికి గాను నేషనల్ అవార్డుని కూడా అందుకున్నాడు. దీన్ని బట్టి హర్ష వర్ధన్ మ్యూజిక్ కి ఉన్న మ్యాజిక్ అని అర్ధం చేసుకోవచ్చు. దీంతో పూరి, విజయ్ సేతుపతి ప్రాజెక్ట్ కి హర్ష వర్ధన్ మ్యూజిక్ ద్వారా సరికొత్త క్రేజ్ ఏర్పడిందని చెప్పవచ్చు.
ప్రభాస్(Prabhas),సందీప్ రెడ్డి(Sandeep reddy vanga)ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ 'స్పిరిట్'(Spirit)కి కూడా హర్ష వర్ధన్ నే మ్యూజిక్ డైరెక్టర్. త్రివిక్రమ్, విక్టరీ వెంకటేష్ కాంబోలో మూవీకి కూడా హర్ష వర్ధనే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పూరి, విజయ్ సేతుపతి ప్రాజెక్ట్ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ ని పూర్తి చేసుకోగా, త్వరలోనే టైటిల్ అనౌన్స్ మెంట్ రావచ్చు.
![]() |
![]() |