![]() |
![]() |

ప్రభాస్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ పేరుకు పరిచయం అక్కరలేదు. తెలుగులో చేసినవి కొన్ని మూవీస్ ఐనా కానీ మంచి పేరు తెచ్చుకుంది. రీసెంట్ గా నారా రోహిత్ తో కలిసి సుందరకాండ అనే క్యూట్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అలా ఒక చిట్ చాట్ షోలో కూడా కొన్ని విషయాలను షేర్ చేసుకుంది. "శ్రీదేవి విజయకుమార్ మీ రీల్ నేమ్ ఆ రియల్ నేమా " అన్న ప్రశ్నకు "రియల్ నేమ్ అండి" అని ఆన్సర్ ఇచ్చారు. "మీ చైల్డ్ హుడ్ హీరో క్రష్ ఎవరు" .." చాలామంది ఉన్నారు కానీ ఫస్ట్ నాకు ప్రభుదేవా గారే..ఎందుకంటే ప్రేమికుడు మూవీ చూసినప్పుడే ఆయన మీద క్రష్ వచ్చింది" అని చెప్పింది. "మీ సినీ జర్నీ గురించి మీ మాటల్లో". "నాకు తెలిసినప్పటి నుంచి ఫిలిమ్స్ లోనే నటించాలని డిసైడ్ అయ్యాను. 5 ఇయర్స్ ఉన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేసాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మూవీస్ లో కంటిన్యూ అవుతూ ఉండడం చాలా హ్యాపీగా ఉంది" అండి శ్రీదేవి. "మీకు ఏమన్నా పూర్తి కానీ కల ఏదన్నా ఉందా" అన్న ప్రశ్నకు "నాకు ఇదే డ్రీం అనేది లేదు. ఏదన్నా కాని సంతోషంగా ఉండాలి అంతే" అని చెప్పింది.
"ఇయర్ లో స్పెషల్ డే ఏది" అనేసరికి "మా నాన్న బర్త్ డే ఆగష్టు 29 ..ఆ రోజు నాకు చాల స్పెషల్. మా నాన్న నా ప్రాణం." అని చెప్పింది. "ఇప్పటివరకు ఇలాంటి రోల్ చేయలేదు అన్న రోల్ ఏంటి" అనేసరికి " చాలా చేయాల్సిన రోల్స్ ఉన్నాయి. చేయాలనీ వెయిట్ చేస్తున్నా. ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలని వెయిట్ చేస్తున్నాను." అని చెప్పింది. ఇక తన ఇష్టాఇష్టాలను కూడా చెప్పుకొచ్చింది. "లవ్, ఫ్రెండ్ షిప్ రెండు ఉండాలి. కాఫీ అంటే ఇష్టం. ఫ్రైడ్ రైస్ ఇష్టం. లవ్ స్టోరీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాను. రీల్స్ ఇష్టం. నేను అంతగా రీల్స్ చేయను కానీ రీల్స్ ఇష్టం. పక్కా నాన్ వెజిటేరియన్ నేను. నేను ఎక్సట్రావెర్ట్ నే. లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం. అందుకే లవ్ చేసి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాను. మూవీస్ అంటే ఇష్టం." అని చెప్పింది శ్రీదేవి.
![]() |
![]() |