![]() |
![]() |

శ్రీదేవి విజయకుమార్ తెలుగు ఆడియన్స్ కి బాగా పరిచయమే. తెలుగులో రుక్మిణి, ఈశ్వర్, నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, ఆదిలక్ష్మి, వీర వంటి మూవీస్ లో నటించింది. రీసెంట్ గా సుందరకాండ మూవీలో నటించింది. ఇక ఈశ్వర్ మూవీలో ఫస్ట్ సీన్ గురించి ఇలా చెప్పింది ఒక చిట్ చాట్ షోలో..."ఈశ్వర్ మూవీలో మీరు ప్రభాస్ గారితో చేసిన ఫస్ట్ సీన్ ఏంటి" అన్న ప్రశ్నకు శ్రీదేవి నవ్వుతూ "ఈ ప్రశ్నను ఇంతవరకు ఎవరూ అడగలేదు. ఫస్ట్ టైం మీరు అడిగారు" అంటూ తన ఫస్ట్ సీన్ గురించి చెప్పింది. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ లో ట్రాఫిక్ సీన్ ఉంటుంది. అక్కడ రెడ్ లైట్ పడేసరికి సైకిల్ మీద వచ్చిన ప్రభాస్ ఆగుతాడు. ఆ పక్కనే శ్రీదేవి స్కూటీ మీద వచ్చి ఆగుతుంది.
ఐతే శ్రీదేవి నెమ్మదిగా అలా అలా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ ముందుముందుకు వచ్చేస్తూ ఉంటుంది. ఇక ప్రభాస్ కూడా ఆ బండి మీద ఫోకస్ చేస్తూ అలా ముందుముందుకు వస్తూ ఉంటాడు. ఐతే ఇక్కడ శ్రీదేవిని ఈ సీన్ లో చూపించరు. తర్వాత స్కూటీ ముందుకు వెళ్లిపోయేసరికి ప్రభాస్ కూడా స్కూటీ కంటే ముందుగా వెళ్లిపోవాలని స్పీడ్ గా సైకిల్ తొక్కుతూ పోటాపోటీగా వెళ్ళిపోతాడు. తర్వాత ఒక టర్నింగ్ పాయింట్ లో వెళ్లి ఆ స్కూటీకి డాష్ ఇస్తాడు. వెంటనే శ్రీదేవి కింద పడిపోతుంది. ఈ మూవీలో ఇదే ఫస్ట్ సీన్ అని చెప్పుకొచ్చింది. ఈ సీన్ ని ట్యాంకుబండ్ నెక్లెస్ రోడ్ లో షూట్ చేసాం అని శ్రీదేవి చెప్పుకొచ్చింది. తెలుగులో చేసిన కొన్ని సినిమాలే కానీ తమిళ్ లో మాత్రం మంచి హిట్స్ తో అక్కడ సెటిల్ ఐపోయింది. ఇక డ్రామా జూనియర్స్ 4 కి జడ్జ్ గా వచ్చింది.
![]() |
![]() |