![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా నటించిన గ్యాంగ్ స్టర్ మూవీ 'ఓజీ'. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 25న థియేటర్లలో అడుగుపెట్టింది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మొదటి రోజు రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.154 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే రెండో రోజు నుంచి ఈ చిత్ర వసూళ్లను మేకర్స్ అనౌన్స్ చేయలేదు. దీంతో అఫీషియల్ కలెక్షన్స్ తెలుసుకోవడం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా మొదటి వీకెండ్ కలెక్షన్స్ ని రివీల్ చేశారు. (They Call Him OG)
ఓజీ సినిమా నిన్నటితో నాలుగు రోజుల ఫస్ట్ వీకెండ్ ను పూర్తి చేసుకుంది. మొదటి నాలుగు రోజులకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.252 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. అంటే మొదటిరోజు రూ.154 కోట్ల గ్రాస్ రాబట్టిన ఓజీ ఫిల్మ్.. తదుపరి మూడు రోజులకు కలిపి రూ.98 కోట్ల గ్రాస్ రాబట్టింది అన్నమాట. (OG Collections)

ప్రస్తుతం దసరా సెలవులు కావడంతో మరికొన్ని రోజుల పాటు, ఓజీ మూవీ మంచి వసూళ్ళు రాబట్టే అవకాశముంది. త్వరలోనే రూ.300 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొదటి 300 కోట్ల సినిమాగా ఓజీ నిలవనుంది.
![]() |
![]() |