![]() |
![]() |
.webp)
శివకార్తికేయన్(Sivakarthikeyan),రుక్మిణి వసంత్(Rukmini Vasanth)జంటగా ఈ నెల 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా మూవీ 'మదరాసి'. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కగా 'మురుగదాస్'(Ar Murugadoss)దర్శకత్వం వహించాడు. శివకార్తికేయన్ గత చిత్రం 'అమరన్'(Amaran)సూపర్ హిట్ కావడంతో అభిమానుల్లో 'మదరాసి' పై భారీ అంచనాలు ఏర్పడటంతో, ఓపెనింగ్స్ కూడా భారీగానే వచ్చాయి. పైగా హిట్ టాక్ కూడా వచ్చింది. కానీ రన్నింగ్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. సుమారు 170 కోట్లరూపాయిలతో నిర్మాణం జరుపుకోగా, 100 కోట్లు మాత్రమే రాబట్టగలిగిందని సినీ ట్రేడ్ వర్గాల టాక్.
ఈ చిత్రానికి సంబంధించిన ఓటిటి హక్కుల్ని అమెజాన్ ప్రైమ్(Amazon Prime)పొందిన విషయం తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నట్టు సదరు సంస్థ అధికారకంగా వెల్లడి చేసింది. దీంతో ఈ విజయదశమి ఓటిటి సినీ ప్రియుల పండగ జోష్ ని రెట్టింపు చేసిందని చెప్పవచ్చు. ఈ మూవీలో రఘురాం క్యారక్టర్ లో శివ కార్తికేయన్ మానసిక రుగ్మతకి గురైన పేషంట్ గా తన కెరీర్ లోనే మరోసారి అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ ప్రదర్శించాడు. డాక్టర్ గా రుక్మిణి వసంత్ కూడా బెస్ట్ ఫార్మెన్స్ ఇచ్చింది. రా పోలీస్ ఆఫీసర్ గా బిజూ మీనన్, విద్యుత్ జిమ్మీ వాల్, షబీర్ తమ విలనిజంతో పతాక స్థాయిలో నటించారు.
చెన్నైలో గన్ కల్చర్ ని తీసుకొచ్చి అలజడులు సృష్టించాలనుకునే తీవ్రవాదుల ప్లాన్ ని రఘురాం ఎలా అడ్డుకున్నాడు అనే పాయింట్ తో మదరాసి తెరకెక్కగా,ఈ క్రమంలో అడుగడుగున వచ్చే సన్నివేశాలు ఎంతగానో అలరిస్తాయి. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ మ్యాజిక్ మరో సారి వర్క్ అవుట్ అయ్యింది. లక్ష్మి ప్రసాద్ నిర్మాణ విలువలు కూడా భారీగా ఉండి అబ్బురపరుస్తాయి. మురగదాస్ టేకింగ్ ప్రతి సీన్ ని ఎంతో వేగంతో పరుగెత్తించింది.
![]() |
![]() |