![]() |
![]() |

సిల్వర్ స్క్రీన్ వద్ద 'మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)కి ఉన్న క్రేజ్ చాలా ప్రత్యేకం. ఎన్టీఆర్ నుంచి సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు థియేటర్స్ వద్ద బారులు తీరుతారు. అభిమానులు అయితే బాణాసంచాలు ,డప్పు వాయిద్యాలతో పండుగ వాతావరణాన్ని తీసుకొస్తారు. ఈ ఆనవాయితీ రెండు దశాబ్దాలపై నుంచి వస్తూనే ఉంది. అంతలా ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటు ఒక
అధ్యాయాన్ని సృష్టించుకున్నాడు. ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతున్న 'వార్ 2'(War 2)నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా ఎన్టీఆర్ వల్లనే పర్వాలేదనే స్థాయిలో కలెక్షన్స్ ని రాబడుతుంది.
రీసెంట్ గా జపాన్(Japan)దేశానికి చెందిన యువతీ ఢిల్లీ ఎయిర్ పోర్ట్(Delhi Airport)లో ప్రత్యక్షమయింది. ఆమె ధరించిన టీ షర్ట్ పై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించి ఉంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు కొంత మంది ఆమెతో మాట్లాడగా నేను ఎన్టీఆర్ కి పెద్ద అభిమానిని. వార్ 2 చూడటం కోసం ఢిల్లీకి వచ్చాను. గతంలో కూడా ఇలాగే ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడు వచ్చాను. మళ్ళీ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడు వస్తానని చెప్పింది. ఇందుకు సంబందించి యువతీ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులైతే ఎన్టీఆర్ రేంజ్ కి ఇదొక ఉదాహరణ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ యువతీ పేరు 'క్రిసో'(Criso).
'ఆర్ఆర్ఆర్' తో ఎన్టీఆర్ కి జపాన్ లో ఎంతో మంది అభిమానులు ఏర్పడ్డారు. రీసెంట్ హిట్ 'దేవర'(Devara)ని జపాన్ లో జపాన్ భాషలోనే రిలీజ్ చేసారంటే, ఎన్టీఆర్ కి అక్కడ ఎంతటి క్రేజ్ ఏర్పడిందో అర్ధం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ కూడా దేవర ప్రమోషన్స్ నిమిత్తం జపాన్ వెళ్లగా, అభిమానులు ఘనస్వాగతం పలకడంతో పాటు ఎన్టీఆర్ కోసం తెలుగు నేర్చుకుని మరి తెలుగులో మాట్లాడటం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నేటికీ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.

![]() |
![]() |