![]() |
![]() |

తెలుగు సినిమా ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు 'అడవి శేష్'(Adavi Sesh).2011 లో విడుదలైన పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వన్ మాన్ షో 'పంజా'లో నెగిటివ్ రోల్ పోషించడం ద్వారా అడవి శేష్ మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత క్షణం, ఎవరు, గూఢచారి, హిట్ సెకండ్ కేస్, మేజర్ వంటి విభిన్న చిత్రాల ద్వారా హీరోగా మారి తనకంటు ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం 'డెకాయిట్' అనే మరో విభిన్న మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
రీసెంట్ గా భారత అత్యున్నత న్యాయస్థానం 'సుప్రీంకోర్టు'(Supreme Court)ఒక ఉత్తర్వుని జారీ చేసింది. సదరు ఉత్తర్వులలో 'దేశ రాజధాని ఢిల్లీ(Delhi)తో పాటు చుట్టు పక్కల ప్రధాన నగరాలైన నోయిడా, గురుగ్రామ్, గజియాబాద్ వీధుల్లో ఒక్క కుక్క కూడా ఉండకూడదంటు పేర్కొంది.వెంటనే వీధి కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలని కూడా తన ఆదేశాల్లో స్పషంగా పేర్కొంది. ఈ క్రమంలో అడవి శేష్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కి లేఖ రాసాడు. సదరు లేఖలో 'చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, ఢిల్లీలో వీధి కుక్కలను సామూహికంగా నిర్బంధించాలన్న ఆదేశం నన్ను తీవ్రంగా కలిచి వేస్తుంది. ఇది మన చట్టపరమైన బాధ్యతలకు, భారతదేశం ఎప్పటినుంచో పాటిస్తున్న కారుణ్య విలువలకు విరుద్ధం. వీధి కుక్కలు మన సమాజంలో ఒక భాగం. వాటిని శత్రువులుగా చూడటం సరికాదు. ఈ ఆదేశాల వల్ల నిరపరాధమైన ప్రాణాలకు హాని కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతున్నాను. టీకాలు వేసి, స్టెరిలైజేషన్ చేసిన కుక్కలు ప్రమాదకరం కాదు. ఈ సమాజంలో గౌరవంగా జీవించే హక్కు వాటికి ఉంది. వాటిని నిర్బంధించడం అనేది తాత్కాలిక ప్రతిచర్య మాత్రమే.
స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కార్యక్రమాలను ముమ్మరం చేయాలి. జంతువులపై క్రూరత్వాన్ని అరికట్టేందుకు కఠినమైన జరిమానాలు విధించాలి. ఇలాంటి చర్యల ద్వారా మనుషులు, జంతువుల భద్రతను ఒకేసారి కాపాడవచ్చు. ఇప్పటికే ఉన్న జంతు సంక్షేమ చట్టాలకు అనుగుణంగా, టీకాలు వేసిన శునకాలను వాటి ప్రాంతాల్లోనే ఉండనివ్వాలి. ఈ సమస్యకు మానవతా దృక్పథంతో పరిష్కారం కనుగొంటారని ఆశిస్తున్నానని అడివి శేష్ తన లేఖలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని కోరాడు. జాన్ అబ్రహం, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్(Janhvi Kapoor)తో పాటు మరికొంత మంది నటీనటులు కూడా సుప్రీం తీర్పుని పునఃసమీక్షించుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.

![]() |
![]() |