![]() |
![]() |

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మాటలు ఎక్కువగా కాంట్రవర్సీ అవుతుంటాయి. తాజాగా 'కింగ్‌డమ్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా విజయ్ స్పీచ్ కాంట్రవర్సీ అవుతోంది. తిరుపతిలో 'కింగ్‌డమ్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా విజయ్ చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడే ప్రయత్నం చేశాడు. అంత వరకు బాగానే ఉంది కానీ.. కొన్ని కాంట్రవర్సీ అయ్యే కామెంట్స్ చేశాడు. (Kingdom Trailer)
"గత ఏడాది నుండి 'కింగ్‌డమ్' గురించి గానీ, సినిమా రిలీజ్ గురించి గానీ ఆలోచిస్తుంటే నా తలకాయలో ఒకటే తిరుగుతాంది. నా మనసులో ఒకటే గట్టిగా అనిపిస్తాంది. మన తిరుపతి ఏడుకొండల వెంకన్న సామి గానీ ఈ ఒక్కసారి నా పక్కనుండి నన్ను నడిపించినాడో.. శానా పెద్దోడినై పూడుస్తాను సామి. టాప్ లో పోయి కూసుంటా." అని విజయ్ అన్నాడు. తాను టాప్ లోకి వెళ్లాలని ఆశపడటంలో తప్పులేదు కానీ.. ఆ తర్వాత విజయ్ మాట్లాడిన మాటలే వివాదాస్పదమవుతున్నాయి.
"ఆ వెంకన్న సామి దయ, మీ అందరి ఆశీస్సులు.. ఈ రెండు నాతో పాటు ఉంటే.. వానెక్క ఏనా కొడుకు మనల్ని ఆపేదేలే." అని విజయ్ అన్నాడు. తిరుపతి వెంకన్న సాక్షిగా జరిగిన ఈవెంట్ లో "వానెక్క ఏనా కొడుకు మనల్ని ఆపేదేలే." అని విజయ్ స్టేట్మెంట్ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.
![]() |
![]() |