![]() |
![]() |

న్యాచురల్ స్టార్ నానికి మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరుంది. అందుకు తగ్గట్టుగానే వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల 'హిట్-3' ప్రేక్షకులను పలకరించిన నాని.. ప్రస్తుతం 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'ది పారడైజ్' చేస్తున్నాడు. అలాగే దర్శకులు సుజీత్, శౌర్యువ్, శేఖర్ కమ్ములతో సినిమాలు కమిటై ఉన్నాడు. ఇప్పుడు ఈ లిస్టులో మరో దర్శకుడి పేరొచ్చి చేరింది. ఆ దర్శకుడు ఎవరో కాదు వెంకీ అట్లూరి.
'సార్', 'లక్కీ భాస్కర్' సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న వెంకీ అట్లూరి.. ప్రస్తుతం సూర్యతో ఓ సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత వెంకీ అట్లూరి.. నానితో సినిమా చేసే అవకాశముంది అంటున్నారు.
వెంకీ అట్లూరి తన గత రెండు చిత్రాలు 'సార్', 'లక్కీ భాస్కర్' ఇతర భాషల హీరోలతో చేశాడు. ప్రజెంట్ మూవీ కూడా సూర్యతో చేస్తున్నాడు. దీంతో వెంకీ.. తెలుగు హీరోలతో సినిమాలు చేయడా అనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. ముఖ్యంగా 'సార్', 'లక్కీ భాస్కర్' వంటి సినిమాల్లో నాని నటిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తుంటారు. అభిమానుల కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. ఓ మూవీ చేయడానికి నాని-వెంకీ చేతులు కలుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కూడా సితార బ్యానర్ లోనే రూపొందనుందని సమాచారం.
మరి నాని 'పారడైజ్' తర్వాత వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తాడా లేక ఇతర సినిమాలు పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్ పైకి వస్తాడా అనేది చూడాలి.
![]() |
![]() |