![]() |
![]() |

మే 30, 2025న విశాఖపట్టణంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(Telugu Film Chamber of commerce)ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, ఎగ్జిక్యూటివ్ కమిటీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలను పరిష్కరించడానికి నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్ ఇలా మూడు రంగాల నుండి నుండి ప్రాతినిధ్యం వహించే 30 మంది సభ్యులతో కూడిన అంతర్గత కమిటీని నియమించింది.
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా ఉన్న పి. భరత్ భూషణ్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తుండగా, ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ కన్వీనర్ గా ఉండనున్నాడు. నిర్మాతల విభాగం నుంచి దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, టి . ప్రసన్న కుమార్, సి .కళ్యాణ్, రవి కిషోర్, సూర్యదేవర నాగవంశీ, డివివి దానయ్య, స్వప్నదత్, వై, సుప్రియ ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ తరుపున పి భరత్ భూషణ్ సుధాకర్ రెడ్డి, సుధాకర్, శిరీష్ రెడ్డి, శశిధర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, రామ్ దాస్, నాగార్జున, సీడెడ్ కుమార్, భరత్ చౌదరి.
ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి టి ఎస్ రామ్ ప్రసాద్,సురేష్ బాబు, సునీల్ నారంగ్, వీర నారాయణ బాబు, పి శ్రీనివాసరావు, అనుపమ్ రెడ్డి, బాల గోవింద్ రాజు, మహేశ్వర రెడ్డి, శివప్రసాదరావు, విజేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
![]() |
![]() |