![]() |
![]() |
మలయాళ, తమిళ, తెలుగు సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ నటుడుగా మంచి పేరు తెచ్చుకుంటున్న షైన్ టామ్ చాకో కుటుంబం యాక్సిడెంట్‌కి గురైంది. టామ్ చాకో కుటుంబం వెకేషన్‌కి వెళ్లింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తమిళనాడులో వీరు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కి గురైంది. ఈ ప్రమాదంలో తండ్రి సి.పి.చాకో మృతి చెందారు. టామ్ చాకోతోపాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురించి తెలిసి మలయాళ చిత్ర పరిశ్రమ షాక్ అయింది. టామ్ చాకో తండ్రి మృతి పట్ల అందరూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. టామ్ చాకో త్వరలోనే కోలుకునే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
2002లో నటుడిగా కెరీర్ ప్రారంభించిన టామ్ చాకో.. మలయాళంలో దాదాపు 50 సినిమాల్లో నటించారు. తెలుగులో నాని హీరోగా నటించిన దసరా చిత్రంతో పరిచయమయ్యారు. ఈ సినిమాలో విలన్‌గా అందర్నీ భయపెట్టాడు టామ్ చాకో. ఆ తర్వాత దేవర, డాకు మహారాజ్, రాబిన్‌హుడ్ చిత్రాల్లోనూ అదే తరహా పాత్రలు పోషించారు. తన కెరీర్‌లో ఎక్కువగా నెగెటివ్ క్యారెక్టర్స్ చేయడం ద్వారానే పేరు తెచ్చుకున్నారు టామ్ చాకో. దానికి తగ్గట్టుగానే నిజజీవితంలోనూ విచిత్రంగా ప్రవర్తిస్తాడనే పేరు కూడా అతనికి ఉంది. చాలా సందర్భాల్లో అతను వ్యవహరించిన తీరు అందరికీ అనుమానాలను కలిగించింది. ఏదైనా మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడా అనే సందేహాన్ని కూడా పలువురు వెలిబుచ్చారు. తన ప్రవర్తనతో, వివాదాలతో అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ నెటిజన్లకు ట్రోలింగ్ ఫిగర్‌గా నిలుస్తుంటారు టామ్ చాకో.
![]() |
![]() |