![]() |
![]() |

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్ లో ఓ సినిమా రానుందని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ పై ఆమిర్ స్పందించాడు. "నేను, లోకేష్ కలిసి ఓ సూపర్ హీరో ఫిల్మ్ చేయబోతున్నాం. ఈ బిగ్ స్కేల్ యాక్షన్ ఫిల్మ్.. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మొదలవుతుంది." అని ఆమిర్ చెప్పుకొచ్చాడు.
ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్'తో జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే 'దాదా సాహెబ్ ఫాల్కే' బయోపిక్ తో పాటు, మహాభారత ప్రాజెక్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. వీటితో పాటు సూపర్ హీరో ఫిల్మ్ కోసం లోకేష్ తో చేతులు కలుపుతున్నారు.
'ఖైదీ', 'మాస్టర్', 'విక్రమ్', 'లియో' వంటి సినిమాలతో లోకేష్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ప్రస్తుతం రజినీకాంత్ తో 'కూలీ' చేస్తున్నాడు. నాగార్జున, ఉపేంద్ర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ఆమిర్ ప్రత్యేక పాత్రలో మెరవనుండటం విశేషం. ఇలా కూలీ కోసం మొదటిసారి చేతులు కలిపిన ఆమిర్-లోకేష్.. ఆ తర్వాత ఓ భారీ యాక్షన్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది.
![]() |
![]() |