![]() |
![]() |

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)తన కెరీర్ లో ఫస్ట్ టైం చేస్తున్న చారిత్రాత్మక మూవీ 'హరిహర వీరమల్లు'(Hari Hara Veeramallu)ఈనెల 12 న పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది. 2023 లో వచ్చిన 'బ్రో 'మూవీ తర్వాత పవన్ నుంచి హరిహర వీరమల్లు వస్తుండటంతో పాటు, పోరాట యోధుడుగా పవన్ కనిపిస్తుండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను వీరమల్లుపై మంచి అంచనాలే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం పవన్ మాట్లాడుతు వీరమల్లుకి సంబంధించి టికెట్ రేట్స్ పెంచుకోవడం, బెనిఫిట్ షోస్ కి సంబంధించిన పర్మిషన్ లాంటి వాటికోసం ఎవరు వ్యక్తిగతంగా హాజరు కాకుండా, ఫిలిం చాంబర్ ద్వారా రావాలని చెప్పడం జరిగింది.
ఈ నేపథ్యంలోనే హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం(Am Rathnam)రీసెంట్ గా తెలుగు ఫిలిం చాంబర్ ని ఆశ్రయించి మరో పది రోజుల్లో విడుదల కాబోతున్న 'వీరమల్లు' కి సంబంధించిన టికెట్ రేట్స్ పెంపు, అదనపు షోల అనుమతి కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల అనుమతి కోరాలనే విన్నపంతో కూడిన ప్రతిని ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ కి అందచేసారు. దీంతో ఛాంబర్ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలని కలవనుంది.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో వీరమల్లు ప్రమోషన్స్ లో వేగం పెరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పాటు నార్త్ లో మేకర్స్ భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఏర్పాటు చేయనున్నారనే వార్తలు వినపడుతున్నాయి. ఈ ఈవెంట్స్ కి పవన్ హాజరు కాబోతున్నాడని కూడా అంటున్నారు. ఇందుకు సంబంధించి అధికార ప్రకటన కూడా రానున్నట్టుగా తెలుస్తుంది. క్రిష్(Krish),జ్యోతికృష్ణ(Jyothi Krishna)సంయుక్తంగా దర్శకత్వం వహించిన వీరమల్లులో నిధి అగర్వాల్(Nidhhi Agerwal)బాబీ డియోల్, జిష్ణు సేన్ గుప్తా,సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపిస్తుండగా కీరవాణి(Keeravani)సంగీతాన్ని అందించాడు.

![]() |
![]() |