![]() |
![]() |

లోక నాయకుడు కమల్ హాసన్(kamal Haasan)జూన్ 5 న 'థగ్ లైఫ్'(Thug Life)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీని లెజండ్రీ డైరెక్టర్ మణిరత్నం(Mani Rathnam)తెరకెక్కించడంతో, అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నై వేదికగా అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా కన్నడ సినీ పరిశ్రమకి చెందిన స్టార్ హీరో శివరాజ్ కుమార్ హాజరయ్యాడు.
ఈ సందర్భంగా శివరాజ్ కుమార్(Sivaraj Kumar)ని ఉద్దేశించి కమల్ మాట్లాడుతు నా జీవితం, బంధం, తమిళం అని మొదలు పెట్టాను. ఇక్కడ ఉన్నది నా కుటుంబం. అందుకే శివరాజ్ కుమార్ ఇక్కడకి వచ్చాడు. కన్నడ భాషకు తమిళమే మాతృక. మీ భాష తమిళం నుంచి పుట్టింది కాబట్టి మీరు కూడా దానిలో భాగమే అని చెప్పాడు. దీంతో కన్నడ భాషని కమల్ అవమానించాడంటు కన్నడ నాట నిరసనలు వ్యక్తమవుతున్నాయి. థగ్ లైఫ్' పోస్టర్స్ తో పాటు కమల్ ఫ్లెక్సీ లని కాల్చివేస్తున్నారు. దీంతో నిన్న బెంగళూరులో జరగాల్సిన 'థగ్ లైఫ్' ఈవెంట్ కి కమల్ హాజరుకాలేదు. తమకి భయపడే కమల్ హాజరు కాలేదని, థగ్ లైఫ్ ని కన్నడ నాట బ్యాన్ చెయ్యాలనే డిమాండ్ ని కూడా తీసుకొస్తున్నారు.
కన్నడ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు విజయేంద్ర యడుయూరప్ప ఎక్స్ వేదికగా స్పందిస్తు కమల్ హాసన్ సంస్కారం లేని వ్యక్తి. కాబట్టే కన్నడ భాషని అవమానించాడు. భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కన్నడ భాష కొన్ని శతాబ్దాలుగా మనుగడలో ఉంది. మాతృ భాషపై అభిమానం ఉండటం మంచిదే. కానీ ఇతర బాషలని అవమానించడం సంస్కారం కాదు. దక్షిణాదిలో సోదర భావాన్ని పెంపొందించాల్సిన కమల్, తమిళాన్ని గొప్పగా చెప్తూ అందులో శివరాజ్ కుమార్ ని భాగస్వామ్యం చేసాడు. దీన్ని బట్టి ఆయనకి అహంకారం అని తెలుస్తుంది. కన్నడిగుల ఆత్మ గౌరవాన్ని అవమానించిందకు వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసాడు.

![]() |
![]() |