![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ(Raviteja)ప్రస్తుతం 'మాస్ జాతర'(Mass Jathara)అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీలో శ్రీలీల(Sreeleela)హీరోయిన్ గా చేస్తుంది. దీంతో ధమాకా కాంబో రిపీట్ అవుతుండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. రవితేజ ఈ మూవీ తర్వాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా నేను శైలజ, చిత్రలహరి, రెడ్ చిత్రాల ఫేమ్ 'కిషోర్ తిరుమల' దర్శకత్వంలో మూవీ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. డిఫరెంట్ చిత్రాలని కిషోర్ పెట్టింది పేరు. అలాంటిది రవితేజ, కిషోర్ కాంబోలో సినిమా అనగానే అందరిలోను ఒకింత ఆసక్తి నెలకొని ఉంది.
ఈ మూవీలో హీరోయిన్ క్యారక్టర్ కోసం మమిత బైజు(Mamihta Baiju)కయదు లోహర్(Kayadu LOhar)పేర్లని చిత్ర బృందం పరిశీలిస్తుందనే వార్తలు వచ్చాయి. ప్రేమలు, రిటర్న్ ది డ్రాగన్ మూవీస్ తో ఆ ఇద్దరు యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించారు. ఈ నేపథ్యంలో రవితేజ సరసన ఆ ఇద్దరిలో ఎవరకి చోటు దొరుకుతుందనే చర్చ సినీ వర్గాల్లో జరిగింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా కేతిక శర్మ(ketika Sharma)పేరు తెరపైకి వచ్చింది. మేకర్స్ కేతిక శర్మ ని తమ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేసారని, ఈ మేరకు అతి త్వరలోనే అధికార ప్రకటన రానున్నట్టుగా తెలుస్తుంది. కేతిక శర్మ రాబిన్ హుడ్ మూవీలో 'అదిదా సర్ప్రైజ్' అంటు తన డాన్స్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. రీసెంట్ గా విడుదలైన 'సింగల్' మూవీతో హీరోయిన్ గా భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో రవితేజతో చెయ్యబోయే ప్రాజెక్ట్ క్రేజీ ప్రాజెక్ట్ గా మారే అవకాశం ఉంది.
దసరా' మూవీ ఫేమ్ సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీలో ఒక్క హీరోయిన్ కాదు, ఇద్దరు హీరోయిన్లకి చోటు ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేతిక శర్మ తో పాటు, మమిత బైజు, కయదు లోహర్ లో ఒకరు ఉండే అవకాశం ఉండచ్చు. ఈ విషయంపై కూడా త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వినోదంతో నిండిన యాక్షన్ జోనర్ లో తెరకెక్కుతుండగా మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
![]() |
![]() |