![]() |
![]() |

తెలుగునాట తిరుగులేని స్టార్స్ లో పవన్ కళ్యాణ్ ఒకరు. పాలిటిక్స్ తో బిజీ అయినప్పటికీ సినిమాల పరంగా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అలాంటి పవన్ మొదటి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే 'హరి హర వీరమల్లు'. పైగా ఇది హిస్టారికల్ ఫిల్మ్. అందుకే షూటింగ్ ఆలస్యమైనా వీరమల్లుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. (Hari Hara Veera Mallu)
వీరమల్లు థియేట్రికల్ రైట్స్ ఒక్క ఆంధ్రా ఏరియాకే రూ.100 కోట్లు చెబుతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి చిత్రం కావడంతో.. ఆంధ్రాలో ఉన్న డిమాండ్ ని బట్టి ఈ రేంజ్ రేట్ చెప్పారని అందరూ అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు నైజాంలో కూడా రూ.50 కోట్లు చెబుతున్నట్లు వినికిడి. నిజాంలో పవన్ కి మంచి పట్టుంది. ఆయన సినిమాలు ఇక్కడ అదిరిపోయే వసూళ్లు రాబడుతుంటాయి. దానికి తోడు ఈమధ్య పలు భారీ సినిమాలు నైజాంలో రూ.60 కోట్లకు పైగా షేర్ రాబట్టాయి. ఈ లెక్కన వీరమల్లు నైజాం బిజినెస్ రూ.45 కోట్లు నుంచి 50 కోట్ల మధ్య క్లోజ్ అవొచ్చని అంటున్నారు. మొత్తానికి వీరమల్లు మూవీ వరల్డ్ వైడ్ గా రూ.200 కోట్లకు పైగా థియేట్రికల్ బిసినెస్ చేసే అవకాశం కనిపిస్తోంది.
![]() |
![]() |