![]() |
![]() |

ప్రముఖ హీరో జయం రవి(Jayam Ravi)కి తమిళ నాట మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన కొన్ని చిత్రాలు తెలుగులోకి కూడా రీమేక్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. జయంరవి తండ్రి ఎడిటర్ మోహన్ తెలుగునాట నిర్మాతగా ఎన్నో హిట్ సినిమాలని నిర్మించాడు. ఇక జయం రవి, తన భార్య ఆర్తి(Aarti)నుంచి విడాకులు తీసుకోబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ సింగర్ కెనీషా(Kenishaa)తో జయం రవి రిలేషన్ లో ఉండటమే విడాకులకి కారణమనే మాటలు వినిపిస్తున్నాయి. ఆర్తి కూడా తన భర్త విడాకులు ఇవ్వడానికి మూడో వ్యక్తి కారణమని చెప్పింది. అప్పట్నుంచి 'కెనీషా' కి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సోషల్ మీడియా వేదికగా మెసేజెస్ వస్తున్నాయి
ఈ విషయంపై 'కెనీషా' మాట్లాడుతు'గుర్తు తెలియని వ్యక్తుల నుంచి హత్య బెదిరింపులు వస్తున్నాయి. నేను కామెంట్ సెక్షన్ ఆఫ్ చెయ్యలేదు.ఎక్కడికి పారిపోలేదు. నాకు సంబంధించిన ఏ విషయంపైనైనా నా ముఖం మీద అడగండి. నిజానిజాలు చెప్పడం నాకు సంతోషమే. కాకపోతే నా వెర్షన్ ని నేను వివరిస్తాను. మీరందరు పెట్టే శాపాల వాళ్ళ నా మనసు ఎంతగా తల్లడిల్లిపోతుందో తెలుసా. కర్మ ఎవరని విడిచిపెట్టదని అంటున్నారు. కానీ నిజం బయటకొచ్చాక నాలాగా మాత్రం మీరు బాధపడకూడదు. నా చుట్టూ జరుగుతున్నకొన్నిటికి నేను కారణమైతే నన్ను కోర్ట్ ముందు ఉంచండి.
మీలో చాలా మందికి నిజం తెలియకపోవడం వల్ల నన్ను సులభంగా నిందిస్తున్నారు.త్వరలోనే నిజం బయటపడుతుందని అనుకుంటున్నాను. అప్పటి వరకు నన్ను ద్వేషించకండని చెప్పుకొచ్చింది.

![]() |
![]() |